Congress ahead in Karnataka: C fore survey కర్ణాటక ఎన్నికలు: సీఫోర్ సర్వేలో చతికిలపడ్డ బీజేపి..

Karnataka elections 2018 congress ahead in all c fore surveys

karnataka assembly elections, C4 survey, c4 survey result, Siddaramaiah, #AnswerMaadiModi, PM Modi, BS Yeddyurappa, Janardhan Reddy, Amit Shah, Rahul Gandhi, Congress, BJP, JDS, Kumara Swamy, karnataka, politics

As karnataka assembly elections 2018 campaign reached a feverish pitch, C fore has released third pre-poll survey which says congress will gain 118 seats to 128 giving shock to bjp which is restricted to 63 to 73 seats.

కర్ణాటక ఎన్నికలు: సీఫోర్ సర్వేతో చతికిలపడ్డ బీజేపి..

Posted: 05/01/2018 12:41 PM IST
Karnataka elections 2018 congress ahead in all c fore surveys

కర్ణాటకలో ఏ పార్టీకి అధికారం రాదని, హంగ్ తప్పదని పలు సంస్థలు తమ తమ పోల్ సర్వేలను ప్రకటించిన వేళ, మరోమారు సీఫోర్ సంస్థ వెల్లడించిన సర్వేతో బీజేపిలో ఉత్సాహం నిరుగారుతుంది. గతంలో పలు ఎన్నికల ఫలితాలను అత్యధిక ఖచ్ఛితత్వంతో వెల్లడించిన సీఫోర్ సర్వే సంస్థ గతేడాది నుంచి కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఇస్తున్న సర్వేలు మాత్రం కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు వస్తాయని స్పష్టం చేస్తూ.. బీజేపికి షాకిచ్చింది. సరిగ్గా ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రంలో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్న ముందురోజునే ఈ ఫలితాలను సీఫోర్ సంస్థ వెల్లడించింది.

అయితే గత ఏడాది నుంచి మూడు పర్యాయాలు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించి.. అక్కడి ఓబర్ల నాడిని స్పష్టంగా తెలుసుకుని సర్వే చేసిన ఈ సంస్థ గత 2013 నుంచి వెల్లడించిన అన్ని ఫలితాలు 99 శాతం ఖచ్చితత్వంగా వచ్చాయి. దీంతో బీజేపి శ్రేణులు చతికిలపడుతున్నారు. తాజాగా ఏప్రిల్ మాసంలో చేసిన సర్వే వివరాలను కూడా ఈ సంస్థ వెల్లడించగా, వాటికి గతంలో చేసిన రెండు సర్వేలకు పెద్దగా తేడా మాత్రం కనబడలేదని వెల్లడించింది. గత మార్చి మాసంలో నిర్వహించిన సర్వేకు రమారమి సమానంగానే ఏప్రిల్ నెల సర్వే ఫలితాలు కూడా వున్నాయి.

ఏప్రిల్ నెలలో కర్ణాటకలోని 165 నియోజకవర్గాల్లోని 24,679 మంది ఓటర్లను సర్వే చేస్తూ, ఫలితాలను వెల్లడించింది సీఫోర్ సర్వే సంస్థ. ఈ ఫలితాల ప్రకారం కాంగ్రెస్ 118 నుంచి 128 స్థానాలు, బీజేపి 63 నుంచి 73 స్థానాలు, జేడీఎస్ 29 నుంచి 36 స్థానాలు ఇతరులు 2 నుంచి 7 స్థానాల మధ్యలో గెలుస్తారని అంచనా వేసింది. అయితే ఇదే సంస్థ గత మార్చిలో వెల్లడించిన ఫలితాలు ఇలా వున్నాయి.. కాంగ్రెస్ కాంగ్రెస్ కు 126, బీజేపీకి 70, జేడీఎస్ కు 27 నుంచి 40, ఇతరులకు 1 స్థానం వస్తాయని పేర్కొంది.

గతేడాదిలోనే సర్వేలకు శ్రీకారం చుట్టి కన్నడీగుడి ఓటు ఎటువైపు వెళ్తుందన్న అంచనాలను తెలుసుకున్న ఈ సంస్థ.. 2017లో 340 పట్టణాలు, 550 గ్రామాలకు చెందిన అన్ని కులాల వారీనీ తమ తొలి సర్వేలో భాగం చేస్తూ సర్వే చేసింది. ఆ ఫలితాల్లో కూడా కన్నడీగుడు తన ఓటును కాంగ్రెస్ వైపుకే మొగ్గుచూపినట్లు స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీకి 120 నుంచి 132 సీట్లు, బీజేపీకి 60 నుంచి 72 సీట్లు, జేడీఎస్ కు 20 నుంచి 30 సీట్లు, ఇతరులకు 1 నుంచి 7 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles