12-yr-old boy dies after mobile phone explodes మొబైల్ ఫోన్ పేలి 12 ఏళ్ల బాలుడు మృతి..

12 year old boy dies after mobile phone explodes while charging

mobile phone explosion, mobile phone, ambikapur hospital, Ravi Sonwan, Khutrapara village, koriya district, chhattisgarh koriya district, chhattisgarh horror, mobile phone news

A 12-year-old boy died on Tuesday night after his mobile phone exploded in his hands in Chhattisgarh's Koriya district. Ravi Sonwan of Khutrapara village, was playing games on the mobile phone when it was being plugged to a charging point at home.

చత్తీస్ గడ్ లో విషాదం.. మొబైల్ ఫోన్ పేలి 12 ఏళ్ల బాలుడు మృతి..

Posted: 04/12/2018 10:36 AM IST
12 year old boy dies after mobile phone explodes while charging

ఛత్తీస్ గఢ్ లో విషాదం చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్ చార్జింగ్ పెట్టి.. గేమ్ ఆడుతుండగా విస్పోటనం జరిగి బాలుడు మృతి చెందిన ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో బాలుడి స్నేహితులకు కూడా తీవ్రగాయాలు అయ్యాయి. ఈ  విషాద ఘటన చత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలోని కుత్రపరా గ్రామాంలో చోటుచేసుకుంది. విస్పోటనం ధాటికి బాలుడ్ని పొట్ట తెగిపోయి.. పేగులు బయటకు వచ్చాయి. దీంతో హడలిపోయిన తల్లిదండ్రులు పొట్టచుట్టూ బలంగా ఓ వస్త్రాన్ని కట్టి... హుటాహుటిన అస్పత్రికి తీసుకెళ్లి.. శస్త్రచికిత్స చేయించినా ఫలితం లేకపోయింది.

వివరాల్లోకి వెళ్తే రవి సోన్ వాన్ (12) ఫోన్‌ను చార్జింగ్ పెట్టి స్నేహితులతో కలిసి గేమ్ ఆడుతుండగా ఫోన్ అతడి చేతిలోనే పేలిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి అంబికాపూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా పరిస్థితి మెరుగుపడకపోవడంతో అక్కడి నుంచి జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశారు. అయితే అక్కడి అంబులెన్స్ డ్రైవర్లు తమ వేతనాల పెంపు డిమాండ్ తో సమ్మలో పాల్గొనడంతో.. బాలుడ్ని సరైన సమయంలో జిల్లా అసుపత్రికి తరలించలేకపోయారు.

ఆసుపత్రి వద్ద ఓ అంబులెన్స్ డ్రైవర్ వున్నా అతను.. సమ్మె సమయంలో తాను పనిచేస్తే.. తమ ఉద్యోగసంఘాలు తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తాయని బయపడి సహకరించలేదు. దీంతో బాలుడి తల్లిదండ్రులు రవి సోన్ వాన్ ను ప్రైవేటు టాక్సీలో అస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితిని చూసిన వైద్యులు చెలించిపోయి.. అతని కాపాడేందుకు పలుమార్లు ఆపరేషన్లు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో రవి మృతి చెందాడు. అయితే రవి స్నేహితుడు మాత్రం కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles