ktr replies to cm chandrababu tweet తెలంగాణ సెంటిమెంటే కాదు.. స్వయం పాలన.. స్వగౌరమోద్యమం..

Ktr replies to cm chandrababu tweet says not to belittle and undermine telangana

chandra babu, KTR, PM Modi, Finance Ministry, Special status, Special package, seperate state, people's sentiment, Telanagana, Andhra Pradesh, Telugu state politics

telangana information minister ktr replies to cm chandrababu tweet says not to belittle and undermine the struggle and sacrifices of telangana people.

తెలంగాణ సెంటిమెంటే కాదు.. స్వయం పాలన.. స్వగౌరమోద్యమం..

Posted: 03/14/2018 02:48 PM IST
Ktr replies to cm chandrababu tweet says not to belittle and undermine telangana

కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ కు తీవ్రమైన అన్యాయం చేస్తుందని అరోపించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు.. తన భావోద్వేగాన్ని ట్విట్టర్ ద్వారా తన ఫాలోవర్స్ తో పంచుకున్నాడు. అయితే ఆ ట్విట్ చూసిన తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ చంద్రబాబుకు ఈ తరహా ట్విట్లు చేసే అప్పుడు ఇకపై జాగ్రత్తగా వ్యవహరించాలని సూచన చేశారు. అసలేం జరిగింది..? ఇంతకీ చంద్రబాబు ఏం ట్విట్ చేశారు..? దానిపై కేటీఆర్ ఎందుకుని విభిన్నంగా స్పందించాడు అంటారా..? అక్కడికే వస్తున్నాం.

సీఎం చంద్రబాబునాయుడు ట్విట్టర్ లో చేసిన కామెంట్ తెలంగాణ వాదుల మనోభావాలను దెబ్బతీసింది. అంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీజేపి శాసనసభ్యుడు విష్ణు కుమార్ రాజు చేసిన ప్రసంగంపై సమాధానమిస్తూ.. అరుణ్ జైట్లో చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు సభలో ఊటంకించారు. అంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రత్యేక హోదా ఇవ్వాలన్న సెంటిమెంట్ బలంగా వుందని, ప్రత్యేక హోదాను కాదన్నా.. కనీసం ఫ్యాకేజీతోనైనా అర్థికంగా ఇబ్బందుల్లో వున్న రాష్ట్రాన్ని అదుకోవాలన్నది ప్రజల అభిమతమని చంద్రబాబు అన్నారు. అయితే ప్రజల్లో సెంటిమెంట్ వుంది కాదా, అని కేంద్రం ప్రత్యేక హాదానో, లేక ప్యాకేజీ ఇవ్వజాలదని కేంద్ర అర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు అసెంబ్లీలో ప్రస్తావించారు.

అయితే సెంటిమెంట్ వుందన్న కారణంగానే తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆయన అదనపు వ్యాఖ్యలు చేసిన వాటిని కూడా ట్విట్టర్లో పెట్టారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సాధన స్వయం పాలనకు స్వగౌరవంతో జరిగిన ఉద్యమమని, ఈ క్రమంలో ప్రజలు చేసిన త్యాగాలను, అమరవీరుల ఆత్మార్పణలను మరువరాదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో అనేక రకాలుగా కేంద్రం తమకు ప్యాకేజీలను కూడా ఇవ్వజూపిందని, అయినా తాము రాష్ట్ర విప్రజలు ఆత్మగౌరవంతో పోరాడి రాష్ట్రాన్ని సాధించారు.

పోరాటాన్ని నీరుగార్చటానికి ఎన్నో ప్రయత్నాలు, కుట్రలు జరిగాయి. ఎన్నో ప్యాకేజీలతో మభ్యపెట్టటానికి ప్రయత్నించినా వాటికి ఆశ పడకుండా పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏపీ హక్కుల కోసం చంద్రబాబు పోరాడవచ్చు, ఉద్యమించవచ్చు.. కానీ  తెలంగాణ ప్రజలను తక్కువ చేసి మాట్లాడొద్దంటూ ట్విట్టర్ ద్వారా బదులిచ్చారు. నిధులు, నీళ్లు, ఉద్యోగాలు, బాష, యాస, స్వగౌరవం, స్వయం పాలన ఇత్యాదులన్నీ కలగలిసింది తెలంగాణ ఉద్యమమని కేటీఆర్ అన్నారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles