ys jagan slams chandrababu responce on centre కేంద్రాన్ని మోసిన చంద్రబాబు.. ఎట్టకేలకు దిగివచ్చారు: జగన్

Ys jagan targets chandrababu on withdrawing support to centre

andha pradesh assembly leader of the opposition, YSRCP party chief ys jagan, jagan targets chandrababu, tdp withdraws support to centre, arun jaitley, andhra pradesh special status, andhra pradesh special package, andhra pradesh politics,

The andha pradesh assembly leader of the opposition, and YSRCP party chief ys jagan targets chandrababu on withdrawing support to centre, says never the central minister changed his words, but its the chief minister who once welcomed centers decision took u turn in immense pressure from people of state.

కేంద్రాన్ని మోసిన చంద్రబాబు.. ఎట్టకేలకు దిగివచ్చారు: జగన్

Posted: 03/08/2018 09:52 AM IST
Ys jagan targets chandrababu on withdrawing support to centre

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కేంద్రం తన ధోరణిని అది నుంచి స్పష్టంగానే చెబుతూ వచ్చిందని, అయితే గడిచిన నాలుగేళ్లు కేంద్రాన్ని తన భుజస్కాందాలపై మోసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు.. తన అవగాహనాలోపంతో కేంద్రం ఒక్కటి చెబితే తాను మరోటి అర్థం చేసుకుని ప్రజలకు చెప్పారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అరోపించారు. కేంద్రం ప్రకటనలను తనకు ఇన్నాళ్లు తనకు అనుకూలంగా మార్చుకుని రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతూ వచ్చిన చంద్రబాబు.. ఎట్టకేలకు నిజానిజాలను గ్రహించి.. కేంద్ర ప్రభుత్వం నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటన చేయడం ప్రజా విజయమని అన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కానీ లేక ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కానీ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఎన్నడూ మాటమార్చలేదని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో చంద్రబాబు గత్యంతరం లేని పరిస్థితుల్లో మెట్టుదిగావచ్చారని అన్నారు. అయితే చంద్రబాబు ఈ చర్యలను సరిగ్గా ఎన్నికల ముందు చేపట్టడం ప్రజలను మరోమారు మభ్యపెట్టడానికేనని అరోపించారు.

కేంద్రమంతి అరుణ్ జైట్లీ ఇచ్చిన తాజా ప్రకటన.. 2016 సెప్టెంబర్ 8న చేసిన ప్రకటనకు ఏ మాత్రం వత్యాసంలేదని అయితే అప్పడు అర్థరాత్రి పూట స్వాగతించిన చంద్రబాబు.. తాజా ప్రకటనను మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. అప్పుడు కేంద్రమంత్రులను సన్మానించిన చంద్రబాబు.. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చెప్పి ప్రకటించారని, దీని వల్ల జరిగే లబ్ది ఇకపై ప్యాకేజీ తీర్చుతుందని అన్నారు. ఇక తాజాగా యూటర్న్ తీసుకొవడం ప్రజల ఒత్తిడే కారణమని, ఇదే ప్రజా విజయమని అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14వ అర్థిక సంఘం అసులు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో ఎలాంటి సిఫార్సులు చేసింది. అయినా దాని పేరును చెప్పి కేంద్రం కప్పదాటు అడుగులు వేస్తుంటే.. ఇన్నాళ్లు ఇక అది ముగిసన అద్యాయమని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం విభేదిస్తున్నారని ఇదంతా కేవలం ఎన్నికల ముందు డ్రామాగా ఆయన కోనియాడారు. పార్లమెంటు సాక్షిగా యూపిఏ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన మాటను నెరవేర్చాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వంపై వుందని జగన్ డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles