Actress Sridevi funeral to get delayed | ఆలస్యం కానున్న శ్రీదేవి అంత్యక్రియలు.. మరణంపై మొదలైన అనుమానాలు

Sridevi dead body may delay to reach india

Sridevi, Sridevi Death, Sridevi Death Mystery, Sridevi Dead Body, Sridevi Autopsy Report, Sridevi Heart Attack, Sridevi Death Case, Sridevi Funeral, Sridevi Dead Body Arrived

Sridevi's funeral to get delayed, body to leave Dubai by late Evening. Indian consulate in Dubai initiates repatriation process to bring Sridevi's body back to Mumbai. Bollywood actress' body likely to arrive in Mumbai at 5.30 pm. According to Some Sources New Doubts Raised on her Death.

శ్రీదేవి భౌతిక కాయం రాక.. ఆలస్యానికి కారణాలివే!

Posted: 02/26/2018 11:49 AM IST
Sridevi dead body may delay to reach india

నటి శ్రీదేవి అంత్యక్రియలు అనుకున్న సమయానికి కన్నా ఆలస్యంగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దుబాయ్‌ లోని జుమీరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్‌ లో శనివారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. శ్రీదేవి బౌతికకాయానికి పోస్టు మార్టం పూర్తయిందని తాజాగా యూఏఈకి చెంది ఖలీజా టైమ్స్ పేర్కొంది.

ఆలస్యానికి కారణాలు..
పోస్ట్ మార్టం తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అందగానే బాడీ పాడవకుండా వైద్యులు ఎంబామింగ్ చేస్తారు. ఆ తరువాత వైద్యులు ఆమె మృతదేహాన్ని పోలీసులకు హ్యాండోవర్ చేస్తారు. వారు డెత్ సర్టిఫికెట్‌ ఇష్యూ చేసి, దానిని అక్కడి పబ్లిక్ ప్రాసిక్యూటర్ హ్యాండోవర్ చేసుకునేందుకు పర్మిషన్ ఇస్తారు.

ఈ నిబంధనలు పూర్తయిన వెంటనే శ్రీదేవి మృతదేహాన్ని రిలయన్స్ కు చెందిన విమానంలో భారత్ కు తీసుకురానున్నారు. నేటి సాయంత్రానికి శ్రీదేవి భౌతికకాయం ముంబై చేరుకుంటుందని భావిస్తున్నారు. దీంతో అంత్యక్రియలు అనుకున్న సమయానికి పూర్తవటం అనుమానంగా కనిపిస్తోంది. సాయంత్రం 5.30 కల్లా ఆమె మృతదేహాం చేరుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

అనుమానాలెందుకు?

ప్రముఖ సినీ నటి శ్రీదేవి మృతి విషయంలో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు అందరికీ తెలిసిన సమాచారం ప్రకారం శ్రీదేవి మరణించిన సమయంలో ఆమె భర్త బోనీకపూర్ కూడా హోటల్లోనే ఉన్నారు. ఆమె మరణించిన విషయాన్ని తొలుత ఆయనే గుర్తించారు. కానీ, ఇప్పడు సంచలన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీదేవి మృత దేహాన్ని హోటల్ సిబ్బందే గుర్తించారట. ఆమె చనిపోయినప్పుడు బోనీ కపూర్ ఇండియాలోనే ఉన్నారని చెబుతున్నారు.

ఆమె మరణం పట్ల ఆమె కుటుంబసభ్యుల్లో కూడా పలు సందేహాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆమె మరణించిన 36 గంటల తర్వాత క్లియరెన్స్ ఇవ్వండంపై సందేహాలు తలెత్తుతున్నాయి. యావత్ భారత దేశాన్ని కుదిపేసిన ఓ సెలబ్రిటీది సాధారణ మరణం అయినప్పుడు... క్లియరెన్స్ ఇవ్వడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందని సందేహపడుతున్నారు. గుండెపోటు కారణంగానే శ్రీదేవి మరణించిందంటూ దుబాయ్ వైద్యులు నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో రెండేసి కథనాలతో శ్రీదేవి మరణంపై స్పష్టత లేకుండా గందరగోళం రేగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles