Uneasiness Chief Minister Again Hospitalized | మళ్లీ ఆస్పత్రిపాలైన పారికర్.. అసలేం అవుతోంది

Goa cm parrikar again hospitalized

Goa Chief Minister, Manohar Parrikar, Parrikar Health, Manohar Parrikar Hospitalized, Manohar Parrikar News, Manhoar Parrikar Illness

Goa Chief Minister Manohar Parrikar was rushed to Goa Medical College and Hospital (GMCH) Sunday evening after he complained of uneasiness, reported PTI. Hospital authorities confirmed that 62-year-old Parrikar was brought to the GMCH in a wheelchair, and has been re-admitted due to symptoms of dehydration and blood pressure.

మళ్లీ ఆస్పత్రిపాలైన గోవా ముఖ్యమంత్రి!

Posted: 02/26/2018 10:28 AM IST
Goa cm parrikar again hospitalized

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. పొత్తికడుపులో నొప్పితో బాధపడుతున్న ఆయన్ని ఆదివారం సాయంత్రం గోవా మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం. ఈ విషయాన్ని గోవా ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణె తెలిపారు.

‘సీఎం డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు, ప్రస్తుతం చికిత్సకు స్పందిస్తున్నారు అని ఆయన వెల్లడించారు. నిపుణులైన వైద్యులు 24 గంటలూ సీఎంను పర్యవేక్షిస్తున్నట్టు రాణె మీడియాకు తెలిపారు. కాగా, 62 ఏళ్ల పారికర్ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. తీవ్ర అస్వస్థతతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరిన పారికర్ గురువారమే డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి నేరుగా అసెంబ్లీకి వచ్చి తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి అస్వస్థతకు గురికావటంతో అనుచరులు ఆందోళనకు గురవుతున్నారు.

ప్రస్తుతం ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. కాగా, డిప్యూటీ స్పీకర్ మైఖెల్ లోబో మాట్లాడుతూ అవసరమైతే ముఖ్యమంత్రిని మెరుగైన వైద్యం కోసం అమెరికాకు తరలిస్తామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles