New age limit for Railway Group D candidates నిరుద్యోగుల నిరసనలకు దిగివచ్చిన రైల్వేశాఖ..

Railway recruitment 2018 good news new age limit for group d candidates

Railway recruitment 2018, Indian Railways news, Jobs in Indian Railways, Group D exam latest news, Age limit for Group D exam, Latest Government news, Latest News, Latest Education News

Railways had come down in the awake of protests by the unemployed youth of the country for Group D posts, the age limit for the same post was increased from 28 to 30 years.

నిరుద్యోగుల నిరసనలకు దిగివచ్చిన రైల్వేశాఖ..

Posted: 02/20/2018 10:26 AM IST
Railway recruitment 2018 good news new age limit for group d candidates

నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వాలు కూడా మనజాలవన్న నిజం తెలుసుకున్నట్లుంది కేంద్ర రైల్వే శాఖ. అందులోనూ సరిగ్గా ఈ ఏడాదిలోనే ఎన్నికలకు వెళ్తామన్న సంకేతాలను ఇచ్చిన ఏడాదిలోనే నిరుద్యోగ యువత అందోళనలు చేపట్టడం సహేతుకంగా భావించలేదు. అందుకనే వెంటనే దిగివచ్చిన రైల్వే శాఖ నిరుద్యోగుల డిమాండ్లకు తలొగ్గింది. వాళ్ల అందోళనను పరిగణలోకి తీసుకున్న రైల్వే శాఖ నిరుద్యోగులకు ఎట్టకేలకు తీపి కబురు చెప్పింది. సుమారు 90 వేల పైచిలుకు గ్రూప్ డి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ). గతంలో వున్న అభ్యర్థుల వయోపరిమితిని 30 ఏళ్ల నుంచి 28 ఏళ్లకు కుదించింది. దీంతో అటు బీహార్ లో నిరుద్యోగులు పెద్ద ఎత్తున అందోళనలు చేపట్టారు.

దీంతో దిగివచ్చిన కేంద్రప్రభుత్వం.. నిరుద్యోగుల డిమాండ్లను పరిగణలోకి తీసుకుంది. దీంతో వయోపరిమితిని యధావిధంగా సవరించింది. ఈ ఏడాది జూలై 1 నుంచి లెక్కించి.. అభ్యర్థుల వయోపరిమితి 30 ఏళ్లకు మించకూడదని సవరణలు చేసింది. దీంతోపాటు, పరీక్షలను మాతృభాషలోనే నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఇందుకుగాను కేరళ రాష్ట్ర యువత డిమాండను పరిగణలోకి తీసుకుంది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. ఇక దీంతో నిరుద్యోగులు పరీక్షలకు సన్నధమవుతున్నారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులను తమ వైపుకు అకర్షించేందుకు కేంద్ర ఈ సవరణలు చేసింది. అయితే ఇది కూడా ముందస్తు ప్రణాళికలో భాగమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

దీంతో అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టులకు ధరఖాస్తు చేసే అభ్యర్థుల వయోపరిమితిని 28 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు పెంచింది. దీంతో మూడేళ్లు సడలింపుతో ఓబీసీ అభ్యర్థుల వయోపరిమితిని 33 ఏళ్లకు, ఐదేళ్ల సడలింపుతో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల వయోపరిమితిని 35 ఏళ్లకు, వికలాంగులకు పదేళ్ల సడలింపుతో 40 ఏళ్లకు పెంచుతూ రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఇప్పటి వరకు కేవలం హిందీ, ఇంగ్లిష్ భాషల్లో నిర్వహించే ఈ పరీక్షలను ఇకపై మాత్రబాషల్లో కూడా నిర్వహించే వెసులుబాటును కూడా కల్పించింది. దీంతో ఇకపై తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఒరియా, బెంగాలీ భాషల్లోనూ రైల్వే పరీక్షలను నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles