Kodumur MLA Mani Gandhi contrition statements టీడీపీపై ఎమ్మెల్యే మణిగాంధీ సంచలన వ్యాఖ్యలు

Kodumur mla mani gandhi sensational comments on tdp

MLA Mani Gandhi sensational comments, Kodumur MLA Mani Gandhi sensational comments, Mani Gandhi Contrition statements, YSRCP MLA Mani Gandhi, TDP MLA Mani Gandhi, defection MLA Mani Gandhi, Mani Gandhi thrashes TDP development mantra, Mani Gandhi sold out to TDP. Andhra Pradesh, politics

Kodumur MLA Mani Gandhi sensational comments on Ruling TDP party, thrashed the development mantra in TDP and said he is sold out to TDP. In the Forth comming six months there will be drastic changes in Andhra Pradesh politics.

టీడీపీకి అమ్ముడుపోయా.. అభివృద్ది తూచ్: ఎమ్మెల్యే పశ్చాతాప వ్యాఖ్యలు

Posted: 02/20/2018 10:45 AM IST
Kodumur mla mani gandhi sensational comments on tdp

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అంచనాలకు తగ్గట్టుగా నిధులను రాబట్టుకోవడంలో పూర్తిగా విఫలమైన టీడీపీ ప్రభుత్వం.. ఇప్పటికే అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలోని విఫక్షాలతో సతమతమవుతున్న తరుణంలో.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అధికార పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టారు. కర్నూలు జిల్లా కొడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ తన మనస్సులోంచి వచ్చిన పశ్చాతాప మాటలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. వైసీపీ పార్టీ తరపున గెలిచిన తాను టీడీపీలో చేరి తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకున్నానని అవేదన వ్యక్తం చేశారు.

టీడీపీలో చేరిన సమయంలో తాను అందరిమాదిరిగానే.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది చూసి తాను ఆ పార్టీలో చేరుతున్నానని చెప్పిన మాటలు అన్ని అబద్దాలని చెప్పారు. అయితే నిజానికి తాను టీడీపీ పార్టీకి అమ్ముడుపోయానని చెప్పారు. అప్పట్లో తమ అధినేత జగన్ చేసిన పలు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో తమను అధికార టీడీపీ ప్రభుత్వం డబ్బులతో ఏకంగా 20 మందిని లోబర్చుకుందని కుండబద్దలు కొట్టారు. ఈ మాటలను తాను అత్మసాక్షిగా చెబుతున్నానని ఆయన పశ్చాతాపాన్ని వ్యక్తం చేశారు.

రానున్న అరు మాసాలలో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంబవిస్తాయని మణిగాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వలసలు పెరుగుతాయని చెప్పారు. బద్వేలు ఎమ్మెల్యే జయరాయుడు కూడా త్వరలో టీడీపీ నుంచి బయటకు వస్తారని ఈ విషయాన్ని ఆయనే తనకు స్వయంగా చెప్పారని అన్నారు. తాను కొడుమూరు నియోజకవర్గ టీడీప ఇంచార్జ్ విష్ణువర్థన్ రెడ్డితో ఎటువంటి పరిస్థితుల్లో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. వైసీపీ నుంచి పోటీ చేసిన తనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సాధించిన దానికంటే అధిక మెజారిటీతో ప్రజలు అశీర్వదించారని మణిగాంధీ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mani Gandhi  MLA  Kodumur  Kurnool  sensational comments  Contrition statements  andhra pradesh  politics  

Other Articles