Plane crash kills 66 in Iran | ఇరాన్ లో ఘోర ప్రమాదం.. 66 మంది దుర్మరణం

Plane crash kills passengers in iran

Iran, Plane Crash, Aseman airlines, Iranian Plane Crash, Semirom, Airplane Crash, Iran Plane Crash

In yet another shocking aviation disaster, an Iranian plane carrying 60 passengers has disappeared from radar and it is feared that it crashed near Semirom, Isfahan Province. Later Official announced that 66 passengers die after Aseman airlines crash near Semirom.

ఘోర ప్రమాదం.. 66 మంది దుర్మరణం

Posted: 02/18/2018 03:00 PM IST
Plane crash kills passengers in iran

ఇరాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విమానం కూలిపోయిన ఘటనలో 66 మంది దుర్మరణం పాలయ్యారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.

టెహ్రాన్ నుంచి యాసౌజికి వెళుతున్న ఏసెమన్ ఏటీఆర్ 72 విమానం సెమీరోమ్ సమీపంలోని పడేనా పర్వత ప్రాంతంలో కుప్పకూలినట్టు సమాచారం. కూలిపోవడానికి ముందు ఈ విమానం పొలాల్లో ల్యాండయ్యేందుకు ప్రయత్నించినట్టు కొందరు ప్రత్యక్ష సాక్షుల కథనంగా స్థానిక టెలివిజన్ ఒకటి పేర్కొంది. విమానం కూలిపోయినట్టు ఇరాన్ బోయర్ పట్టణ గవర్నర్ అహ్మద్ ధ్రువీకరించారు.

15 రోజుల వ్యవధిలో విమానం కూలిపోయిన రెండో ఘటన ఇది. గత వారం రష్యాలోనూ ఇదే విధంగా ఓ విమానం కూలిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది. టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే మాస్కో సమీపంలో విమానం కూలిపోవడంతో 71 మంది మృతి చెందారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Iran  Plane Crash  ఇరాన్  విమాన ప్రమాదం  

Other Articles