Director RGV appears before CCS Police | సీసీఎస్ ఎదుట హాజరైన వర్మ.. ఉక్కిరి బిక్కిరి చేసిన పోలీసులు

Rgv attended before ccs police

Ram Gopal Varma, Central Crime Station Police, Hyderabad, GST Movie, Activist Devi. RGV Police, RGV CCS Police

Film Director Ram Gopal Varma appeared before the Central Crime Station police officials here on Saturday afternoon in connection with a case booked against him for alleged derogatory remarks on women and GST Video which contains nudity with Porn Star Mia Malkova.

ముగిసిన వర్మ విచారణ.. మళ్లీ హాజరు కావాలని ఆదేశం

Posted: 02/17/2018 04:03 PM IST
Rgv attended before ccs police

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎట్టకేలకు పోలీసుల ముందు హాజరయ్యాడు. గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' సినిమా నిర్మాణం, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులకు సంబంధించి శనివారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా వర్మపై విచారణ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.

విచారణ పూర్తయ్యాక బయటకు వచ్చిన వర్మ మీడియాతో నో కామెంట్ చేసి వెళ్లిపోయారు. మళ్లీ ఆయన సోమవారం తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించారంట. నిజానికి ఆయన గతంలోనే ఆయన సీసీఎస్ ఎదుట హాజరుకావాల్సి ఉంది. అయితే ఆ టైంలో షూటింగ్ లో ఉన్నానని చెప్పటంతో మరోసారి నోటీసులు పంపించారు. ఈ దఫా హాజరుకాకపోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించటంతో 17వ తేదీ(నేడు) హాజరయ్యారు.

ఐపీసీలోని 506తో పాటు ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి, నిందితుడిగా రాంగోపాల్‌ వర్మ పేరు పొందుపరిచారు. సీఆర్పీసీ 41 ప్రకారం ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. మొత్తం ఐదుగురు అధికారులు మూడు గంటలపాటూ ఆయన్ని ప్రశ్నించారు. మొత్తం 24 ప్రశ్నలకు పోలీసులు వివరణ కోరినట్టు సమాచారం. ఈ రోజు విచారణ ముగిసిన వెంటనే మరో నోటీసును వర్మకు అందజేశారు. సోమవారం కూడా విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు ఆయన మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ ను పోలీసులు సీజ్ చేశారు. వర్మకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎలాంటివారితో సంబంధాలు ఉన్నాయి తదితర అంశాలకు సంబంధించిన వివరాలు వీటిలో లభించే అవకాశం ఉన్నందున... పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

వర్మ ఎదుర్కొన్న కొన్ని ప్రశ్నలు...

  • ఐటీ యాక్ట్ ప్రకారం మహిళలను అశ్లీలంగా చూపించడం తప్పు. దీనికి మీ సమాధానం ఏమిటి?
  • మీ ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్లలో పెట్టిన పోర్న్ స్టార్ మియా మాల్కోవా ఫొటోలు ఎక్కడివి?
  • ఓ టీవీ ఛానల్ చర్చలో విశాఖపట్నంకు చెందిన మహిళ మీద మీరు చేసిన కామెంట్లు అభ్యంతరకరం కాదా?
  • దేవితో పోర్న్ సినిమా తీస్తాననడం ఎంత వరకు కరెక్ట్?
  • ఈ సినిమాకు భారతీయ చట్టాలు వర్తించవు అని మీరు అంటున్నారు.... దీనికి మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి?ః
  • సినిమాను అమెరికాలో తీశాను, అక్కడ నుంచే ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేశామని చెబుతున్నారు. సినిమాను ఎలా తీశారు? పెట్టుబడి ఎవరు పెట్టారు?
  • విమియో వెబ్ సైట్ కు ఈ సినిమాను ఎంతకు అమ్మారు?
  • సినిమాలో నటించిన మాల్కోవాకి డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చారు?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles