advani assures tdp mp's he will talk to arun jaitley కేంద్ర బడ్జెట్ లో ఏపీ నిధులపై అద్వానీ కామెంట్

Lk advani assures tdp mp s he will talk to arun jaitley

lk advani, Arun Jaitley, BJP, BJP senior leader, 2018 budget, special status, special package, Andhra Pradesh

BJp Senior leader LK advani assures tdp mp's, who are protesting against the allocations to Andhra pradesh state, that he will talk to finance minister arun jaitley and initaite him to take necessary steps

ఏపీ నిధులపై అద్వానీ కామెంట్

Posted: 02/09/2018 05:27 PM IST
Lk advani assures tdp mp s he will talk to arun jaitley

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్న క్రమంలో అధికార పార్టీ నుంచి సంతృప్తికరమైన నిర్ణయం రాకపోయినా.. లోక్‌సభలో వివిధ పార్టీల మద్ధతు సాధించడంలో టీడీపీ ఎంపీలు విజయం సాధించారు. మరీ ముఖ్యంగా బీజేపీ కురువృద్ధుడు ఎల్కే ఆద్వానీ టీడీపీ ఎంపీలకు లోక్ సభలో సూచనలు చేశారు. సభా మర్యాదలు పాటిస్తూ నిరసన వ్యక్తం చేయాలని ఆద్వానీ, ఎంపీలకు సూచించారు. వేరే దారి లేకే వెల్ లోకి వచ్చామని టీడీపీ ఎంపీలు బదులిచ్చారు. టీడీపీ ఎంపీలతో ఆద్వానీ 10 నిమిషాలపాటు మాట్లాడారు. ఏపీ సమస్యలపై అరుణ్ జైట్లీతో కూడా మాట్లాడానని, ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆడ్వాణీ వ్యాఖ్యానించారు.
 
ఇప్పటికే ఏపీకి బడ్జెట్‌లో జరిగిన అన్యాయంపై ఎన్డీయేలోని భాగస్వామ్య పక్షాలు మద్ధతు తెలుపుతున్నాయి. అకాళీదల్, శివసేన, తృణాముల్ కాంగ్రెస్ పార్టీలు ఏపీకి జరుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు టీఆర్ఎస్ ఎంపీలు కవిత, జితేందర్‌రెడ్డి టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనకు మద్ధతు తెలిపారు. ఏపీ ఎంపీల నిరసనలకు మద్దతిస్తున్నట్లు కవిత ప్రకటించారు. సుమారు 10 నిమిషాల పాటు కవిత ఏపీ సమస్యల గురించి మాట్లాడారు. చివరగా ‘జై ఆంధ్రా’ అంటూ కవిత తన ప్రసంగాన్ని కవిత ముగించారు. బుధవారం రోజు టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి కూడా ఏపీ ఎంపీలకు మద్దతిచ్చారు.
 
అయితే టీడీపీ ఎంపీలు మాత్రం తమ పట్టు విడలేదు. టీడీపీ ఎంపీల నిరసనలతో పార్లమెంట్ దద్దరిల్లింది. ఉభయసభల్లో టీడీపీ ఎంపీలు నిరసనలు కొనసాగించారు. విభజన హామీలు అమలు చేయాలంటూ లోక్‌సభలో వరుసగా ఐదోరోజు టీడీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. శుక్రవారం ఉదయం సభ మొదలైన వెంటనే టీడీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసనకు దిగారు. బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ నినాదాలు చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ వారించినా ఎంపీలు తమ నిరసనను కొనసాగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles