Ramdev's Patanjali wants marijuana legalised గంజాయిని చట్టబద్దం చేయాలన్న రాందేవ్ పతాంజలి

Ramdev s patanjali wants marijuana legalised in india social media can t keep calm

Ramdev, yoga guru, Patanjali, marijuana, ganja, legalisation of marijuana, social media, trolls, medicine, health treatment

Smoking marijuana has often been defended by its patrons, citing its medicinal properties, and they couldn't be prouder to have finally found their spokesperson in Ramdev, or more specifically, his brand, Patanjali.

గంజాయిని చట్టబద్దం చేయాలన్న రాందేవ్ పతాంజలి

Posted: 02/09/2018 07:59 PM IST
Ramdev s patanjali wants marijuana legalised in india social media can t keep calm

గంజాయి కూడా మాదకపదార్థమే అని దేశంలో ఈ మొక్కలు పెంచడం, అక్రమ రవాణా, అమ్మకాలు, అన్నింటిపై ఎక్సైజ్ అధికారులు కొరడా ఝుళిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు విరుద్ధంగా యోగా గురు బాబా రాందేవ్ మాత్రం మరో కొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకువస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా లోని పలు రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడ మన దేశంలో గంజాయిని చట్టబద్ధం చేయాలని ఆయన అద్వర్యంలో నిర్వహించబడుతున్న పతాంజలి సంస్థ కోరుతుంది.

అదేంటి గంజాయిని పెంచాలన్న డిమాండ్ ఎంటీ..? పతాంజలి సంస్థ ఏంటని విస్మయం వ్యక్తం చేస్తు్న్నారా.. దాని వెనుకు కూడా కారణాలు లేకపోలేదు. పురాతన కాలంలో గంజాయి మొక్కలను వైద్య అవసరాల కోసం ఉపయోగించేవారని.. ఆ మొక్కల్లోని ఔషధాలు ఎన్నో రోగాలను నయం చేసిందని చెబుతోంది. గంజాయిలోని ఉపయోగాలను ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో పతంజలి కంపెనీ అధ్యయనం చేస్తుందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాలకృష్ణ ప్రకటించారు.

హరిద్వార్ లోని పతంజలి రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ లో 200 మంది శాస్త్రవేత్తలు దేశీయ మొక్కలు, వాటి ప్రయోజనాలు, వైద్య అవసరాలపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. విదేశాల్లో ఈ గంజాయి చట్టబద్దమైనప్పటికీ.. భారత్ లో ఇది చట్ట వ్యతిరేకంగా భావిస్తున్నారన్నారు బాలకృష్ణ. గంజాయి వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయంటున్నారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ గంజాయి చట్టబద్దమైనదని, దీని ద్వారా 800 కోట్ల ఆదాయంతో అక్కడ ఈ పంట లాభాలను ఆర్జిస్తుందన్నారు. కెనడాలో కూడా చట్టబద్దమైనని, కెనడా GDPలో దాని వాటా 0.2 శాతం అని తెలిపారు.

యూరప్ దేశాల్లోని మార్కెట్లలో గంజాయి మొక్కల ద్వారా ఆయిల్స్ , ఫైబర్, దుస్తుల్లో ఉపయోగిస్తున్నారని వివరించారు. విషకారకమైన పదార్ధాలను ఆ మొక్కల్లో నుంచి తొలగించి ఉపయోగపడే విధంగా అందిస్తామని.. అందుకు కావాల్సిన అనుమతి కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు బాలక్రిష్ణ. దీనిని భారత్ లో చట్టబద్దం చేయడం ద్వారా ప్రజలకు ఇది ఓ వ్యాపార అవకాశంగా కూడా మారుతుందని పతంజలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles