driver alleges rayapati ranaga rao for his suicide డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.. రాయపాటి బెదిరింపులే కారణం..?

Driver alleges rayapati ranaga rao for his suicide

vijaya raju, mp rayapati sambashiva rao, rayapati ranga rao, konapati prunachandra, driver, venkatesh, andhra pradesh, crime

Driver Vijaya raju who is undergoing treatment in government hospital alleges MP Rayapati son Ranaga rao threats for his extreme step

డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.. రాయపాటి బెదిరింపులే కారణం..?

Posted: 02/08/2018 10:14 AM IST
Driver alleges rayapati ranaga rao for his suicide

టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడి వేధింపులకు గురైన కారు డ్రైవర్ తనవు చాలించేందుకు ఉపయుక్తడయ్యాడు. రాయపాటి డ్రైవర్ ఆత్మహత్యాయత్నం ఘటన గుంటూరులో కలకలం రేపుతుంది. ఫార్లమెంటు సభ్యుడు మనవరాలు కారు డ్రైవర్ గా పనిచేస్తున్న కారు డ్రైవర్ విజయరాజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడాడు.

ఘటన వివరాల్లోకి వెళ్తే.. రాయపాటి కుమారుడు రాయపాటి రంగారావు కుమార్తె కారు డ్రైవర్‌గా పనిచేసి మానేసిన విజయరాజు.. వేరే కారు డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. దీంతో తనను పిలిపించి తన కూతరు వద్ద డ్రైవర్ గా పనిచేసిన సమయంలో అడ్వాన్స్ గా రూ.15 వేలు తీసుకున్నావని, వాటిని వెంటనే తిరిగి చెల్లించాలని లేకపోతే చంపుతానని రంగారావు, అతని స్నేహితులు కోటపాటి పూర్ణచంద్ర, డ్రైవర్ వెంకటేశ్‌లతో కలసి తనను బెదిరిస్తున్నారని అవేదన వ్యక్తం చేశాడు.

కులం పేరుతోనూ తనను ధూషించి, మానసికంగా వేధించారని పేర్కొన్నాడు. ఈ మేరకు విజయరాజు ఆత్మహత్యాయత్నానికి ముందు రాసిన సూసైడ్ నోట్‌లో ఆరోపించాడు. తన ఆత్మహత్యకు ఈ ముగ్గురే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విజయరాజును వెంటనే గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles