UFO flew by Moon during Lunar Eclipse గ్రహణం రోజున చంద్రుడిపై ఏలియన్ల పరిశోధన.?

Ufo flew by moon at high speed during lunar eclipse

ufo, aliens, moon, conspiracy, moon eclipse, Lunar Eclipse, research, Mystery, science and technology, astronauts, alien astronuts

An object travelling at a very high rate of speed going down the left side of the moon and downwards to the left until it was out of the frame during Lunar Eclipse. Trailing behind the object was a pulsating/flashing light that seemed to flash at regular interval.

ITEMVIDEOS: గ్రహణం రోజున చంద్రుడిపై ఏలియన్ల పరిశోధన.?

Posted: 02/03/2018 12:08 PM IST
Ufo flew by moon at high speed during lunar eclipse

జనవరి 31న యావత్ ప్రపంచం.. 152 ఏళ్ల తరువాత దాదాపుగా 78 నిమిషాల పాటు సంభవించిన సంపూర్ణ రహుగ్రస్త చంద్రగ్రహణాన్ని ఎంతో ఆసక్తిగా వీక్షించగా, నాసా సహా పలు దేశాల శాస్త్రవేత్తలు మాత్రం గ్రహణం సమయంలో పలు పరిశోధనలకు సముచిత సమయమని భావించి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే భూగ్రహంపై నున్న శాస్త్రవేత్తలే కాకుండా ఏకంగా గ్రహాంతరవాసులు కూడా ఇలాంటి పరిశోధనలే చేశారా..? అన్న అనుమానాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుండటంతో అసలు గ్రహాంతర వాసులు వున్నారా..? అన్న అంశానికి కూడా చెక్ పడినట్టేనన్న వాదనలు వినబడుతున్నాయి. ఈ వీడియోలో ఏలియన్ హంటర్లకు యూఎఫ్ఓ కనిపించడం ఆసక్తిరేపుతోంది. గ్రహణం సమయంలో చంద్రుడి పక్కనుంచి మెరుపు వేగంతో వెళ్లిన ఒక వస్తువు కనిపించింది.

అది కూడా క్రమంగా వెలుతురును విరజిమ్ముతూ వెళ్లడంతో అది గ్రహాంతరవాసులకు సంబంధించిన యూఎఫ్ఓ అని భావిస్తున్నారు. అంతేకాదు గ్రహాంతరవాసులు ఆ యూఎఫ్ఓలో చంద్రుడిపైకి వెళ్లి గ్రహణం పట్టిన తరువాత చంద్రుడిని వీడి వెళ్తున్నారని కూడా ఏలియన్ హంటర్ల భావిస్తున్నారు. నాసా విడుదల చేసిన వీడియోలో కూడా ఈ వస్తువు కనిపించడంతో ఏలియన్ హంటర్లు.. అది గ్రహాంతరవాసులకు చెందిన అంతరిక్షవాహనమని, అందులో వారు పరిశోధనల నిమిత్తం ప్రయాణిస్తున్నారని.. ఏలియన్స్ ఉన్నారనేందుకు ఇదే నిదర్శనమని కూడా బల్లగుద్ది వాదిస్తున్నారు.

మనిషి తయారు చేసిన ఏ వాహనం కూడా అంతటి మెరుపు వేగంతో ప్రయాణించడం సాధ్యం కాదని కూడా ఏలియన్ హంటర్ల తేల్చిచెబుతున్నారు. యూఎఫ్‌ఓ మానియా అనే చానెల్ పోస్టు చేసిన ఈ వీడియోను కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే లక్షా 27 వేల 800 మందికిపైగా వీక్షించారు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఏలియన్ హంటర్ల వాదనలను తోసిపుచ్చుతున్నారు. అది బోయింగ్ ఎయిర్ క్రాప్ట్ లేదా వెదర్ బెలూన్ అయ్యివుండవచ్చునని పేర్కొంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles