Police claims; minister killed wife, committed suicide ఏడు పదుల వయస్సులో ఇదేం పని మంత్రివర్యా.?

Senior pakistan minister commits suicide after shooting wife dead

Mir Hazar Khan Bijarani, senior minister, former lawmaker wife, Fariha Razzaq, altercations, Karachi, Sindh province, Pakistan, crime

A senior minister in Pakistan’s Sindh province, whose bullet-riddled body was found in his house along with that of his wife, first killed her and then used the same weapon to commit suicide

ఏడు పదుల వయస్సులో ఇదేం పని మంత్రివర్యా.?

Posted: 02/03/2018 01:14 PM IST
Senior pakistan minister commits suicide after shooting wife dead

ఆయనో మంత్రి. అందులోనూ సీనియర్ అమాత్యులు. దేశానికి సంబంధించిన అంశాలను, ప్రజాభివృద్దికి, సంక్షేమానికి పథకాలను రూపొందించి వాటి అమలు తీరు, అవి ఎలా అమలవుతున్నాయన్న విషయాలపై శ్రద్ద వహించడానికే అసలు తీరిక వుండదు. తనకు అటు ప్రజల నుంచి కానీ, అధికారుల నుంచి కానీ ఎప్పుడైనా విసుగు తెప్పించే ఘటనలు జరిగినా ఎంతో ఓపికతో, సహనంతో వ్యవహరించాల్సిన స్థానంలో వున్నారు.

అయితే ఈ మంత్రివర్యలు మాత్రం ఏకంగా ఏడు పదుల వయస్సులో చేయకూడని పెద్ద తప్పిదమే చేశారు. తనకు ఇన్నాళ్లుగా అండగా వుంటూ వచ్చిన తన సహదర్మఛారిణిని తుపాకీతో కాల్చి మట్టుబెట్టాడు. అంతే తన కోపం చల్లారిన తరువాత ఉత్పన్నం కానున్న పరిస్థితులను అలోచించి వెంటనే తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇదే అలోచన అమెను తుపాకీతో కాల్చకముందే వుండివుంటే ఎలాంటి అనర్థమూ జరిగేదే కాదు.

వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్‌లోని సింధ్‌ రాష్ట్రంలో సీనియర్‌ మంత్రి మీర్‌ హజార్‌ఖాన్‌ బిజ్‌రాని(71) తుపాకీతో భార్యను కాల్చిచంపి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఆ దేశంలో కలకలం రేపుతోంది. ఇద్దరి మృతదేహాలను వారి బెడ్‌రూమ్‌లోనే రక్తపుమడుగులో పోలీసులు గుర్తించారు. మీర్‌ భార్య ఫరీహ రజాక్‌ కూడా గతంలో పాక్‌ చట్టసభకు ప్రాతినిథ్యం వహించారు.

పాకిస్థాన్‌ లోని సింధ్‌ రాష్ట్రంలో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సీనియర్‌ మంత్రి, ప్లానింగ్ అండ్ డెవలెప్మెంట్ శాఖ మంత్రి మీర్‌ హజార్‌ ఖాన్‌ బిజ్రానీ అతని భార్య ఫరీహా రజాక్ వారి బెడ్ రూములో రక్తపు మడుగులో పడివున్నారన్న వార్త స్థానికంగా కలకలం రేపింది. దేశ రాజధాని కరాచీకి దక్షిణ భాగంలో అత్యంత కట్టుదిట్టమైన ఢిఫెన్స్ కాలనీలోని వీరి ఇంట్లో ఇలాంటి దారుణం చోటుచేసుకుందని వార్త దావనంలా వ్యాపించిడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ప్రాథమిక సమాచారాన్ని మీడియాకు తెలిపిన పోలీసులు మంత్రి తన భార్యతో గొడవ నేపథ్యంలో అమెపై మూడు రౌండ్లు కాల్పులు జరిపిన అనంతరం.. తాను అదే తుపాకీతో కాల్చుకుని చనిపోయారని తెలిపారు. మంత్రి ఇంట్లో పనిచేసే వ్యక్తిగత సిబ్బందితో పాటు కపాలా కాసే సెక్యూరిటీ గార్డులను విచారించిన తరువాత ఈ వివరాలను వెల్లడించారు. వారిద్దరి మధ్య నెలకొన్న కలహాల కారణంగానే ఈ దుర్ఘటనకు కారణమని అనుమానిస్తున్నట్లు చెప్పారు. అయితే ఏడు పదుల వయస్సులో అభిప్రాయభేధాలతో తన భార్యను హతమార్చడమేంటన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mir Hazar Khan Bijarani  Fariha Razzaq  altercations  Karachi  Sindh province  Pakistan  crime  

Other Articles