Rajasthan man beats up own kids రాక్షసతండ్రి శిక్షలపై నెట్ జనుల అగ్రహం..

Father mercilessly beats children in rajasthan video goes viral

Chain Singh, Rajsamand, Phukiyathar village, Mangi Lal, Deogarh police station, Rajasthan, crime

A 33-year-old man was arrested in Rajsamand’s Phukiyathar village for allegedly caning his infant children as they ‘used to eat mud and poop in their pants’, police said.

ITEMVIDEOS: రాక్షసతండ్రి శిక్షలపై నెట్ జనుల అగ్రహం..

Posted: 01/31/2018 04:19 PM IST
Father mercilessly beats children in rajasthan video goes viral

తల్లిదండ్రులు ఎంటు పిల్లలు మారం చేయడం సహజమే. తాము పట్టుబట్టిన దానినే కావాలని ఏడుస్తారు.. అయినా తల్లిదండ్రులు సహనంతో వారిని సముదాయిస్తారు. లేదా.. వారిని ఊరడించడమో లేక మాటమరిపింపజేసేలాంటి ప్రయత్నాలు చేయడమో చేస్తారు. అప్పటికీ వినకపోతే కొట్టేస్తానంటూ కన్నెరచేస్తారు. కానీ పిల్లాడు మారం చేస్తున్నాడని ఏకంగా తండ్రి వారిని ఇంత దారుణంగా హింసించడం మాత్రం అరుదు.

కోపం వచ్చిన ఓ తండ్రి.. విచక్షణ కోల్పోయి కన్న పిల్లలను ఊరడించేందుకు బదులు పైశాచికత్వంతో దండించడం మాత్రం మనం ఎంత వెతికినా కనిపించదు. కానీ రాజస్థాన్ లోని రాజసమంద్ జిల్లా ఫుకియాథడ్ లో వెలుగు చూసిన ఘటన మాత్రం అందర్నీ నివ్వరపరిచింది. జనవరి 28వ తేదీన కన్న కొడుకు, కూతురిని తల్లిదండ్రులు ఇంట్లోనే కొడుతున్న విజువల్స్ కలకలం రేపుతున్నాయి. అల్లరి చేస్తున్నాడని.. ఇంట్లో దుస్తులు అన్నింటిని పాడు చేస్తున్నాడని కొడుకు లలిత్ (ఐదేళ్లు)ను తీవ్రంగా హింసించాడు తండ్రి చైన్ సింగ్.

చైన్ సింగ్ కు ఇద్దరు సంతానం. ఐదేళ్ల లలిత్ తో పాటు మూడేళ్ల లాలాజవంతి. వారు అడుకుంటూ ఇంట్లోని బట్టలను లాగి పాడు చేస్తుండటంతో అగ్రహం కట్టలు తెంచుకున్న తండ్రి.. వారికి కఠిన దండన విధించాడు. అభంశుభం తెలియని పిల్లలు అల్లరి చేస్తుంటే ముద్దారాగ దెగ్గరకు తీసుకోవాల్సిన తండ్రి.. అందుకు భిన్నంగా ఇంట్లో దూలానికి తాడు కట్టి.. ఉరి వేసినట్లు తన కొడుకును వేలాడదీశాడు. గొంతుకు తాడు బిగుస్తుండటంతో గిలగిలా కొట్టుకున్నాడు చిన్నారి లలిత్.

అప్పటికీ తండ్రికి కోపం చల్లారకపోవడంతో.. ఓ వైపు ఏడుస్తున్న కొడుకును బెత్తంతో బాదేశాడు. ఆ తర్వాత.. కూతురి లాలాజవంతి (మూడేళ్లు)ను చావగొట్టాడు. వీపుపై వాతలు పెట్టాడు. ఆ పక్కనే తల్లి ఉన్నా కనీసం వారించలేదు. ఈ వ్యవహారం మొత్తాన్ని చైన్ సింగ్ తమ్ముడు రావత్ వీడియో తీశాడు. దీన్ని సోషల్ మీడియాలో పెట్టటంలో వైరల్ అయ్యింది. దీంతో ఆ తల్లిదండ్రులను నెటిజన్లు తిట్టిపోశారు. ఈ ఘటనను సుమోటాగా స్వీకరించింది బాలల సంక్షేమ సమితి. ఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. పిల్లలను ప్రశ్నిస్తే.. తండ్రి ఎప్పుడూ ఇలాగే కొడుతుంటాడని చెప్పారు. పోలీసులు కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. తండ్రి చైన్ సింగ్ కు అరెస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chain Singh  Rajsamand  Phukiyathar village  Mangi Lal  Deogarh police station  Rajasthan  crime  

Other Articles