tollywood actor samrat reddy gets big relief యువనటుడు సామ్రాట్ రెడ్డికి స్వల్ప ఊరట

Tollywood actor samrat reddy gets big relief court grants bail

Telugu Actor Samrat Reddy, Samrat Reddy Arrest, Samrat Reddy, Madapuru Police, Telugu young hero, tollywood actor, Samrat Reddy, Arrest, Madapuru Police, Harshitha reddy, cyberabad police, crime

Tollywood actor Samrat Reddy released from cherlapally jail today after the court grants him bail. He was taken into custody by The Madhapur police based on the complaint lodged by his wife Harshita Reddy.

యువనటుడు సామ్రాట్ రెడ్డికి స్వల్ప ఊరట

Posted: 01/31/2018 05:43 PM IST
Tollywood actor samrat reddy gets big relief court grants bail

టాలీవుడ్ యంగ్ హీరో సామ్రాట్ రెడ్డిపై అతని భార్య హర్షిత మాదాపూర్ పోలీసులకు దొంగతనం చేశాడని పిర్యాదు చేయడంతో అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ విధించడంతో నిన్న అతన్ని చర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసిందే, కాగా తనపై మోపబడిన అభియోగాలన్నీ కల్పితమైనవేనని మీడియాతో చెప్పిన సామ్రాట్ రెడ్డి.. ఇవాళ బెయిల్ పై విడుదలయ్యారు. తన భార్య సహా అమె తల్లి, తండ్రి కృష్ణారెడ్డీ తనపై కావాలని పోలీసులకు పిర్యాదు చేశారని సామ్రాట్ తెలిపారు.

మాదాపూర్ పరిధిలోని హర్షిత నివాసంలోంచి తాను కేవలం తన వస్తువులను మాత్రమే తీసుకున్నానని, అయితే అమెపై కోపంతో సిసిటీవీని బద్దలు కోట్టానని, అదే తాను చేసిన తప్పని సామ్రాట్ చెప్పిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని సామ్రాట్ రెడ్డి తరపు న్యాయవాది బెయిల్ పిటీషన్ లో కూడా పేర్కొన్నారని సమాచారం. వాదనలు విన్న న్యాయస్థానం సామ్రాట్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయనకు స్వల్పఊరట లభించనుంది.

ఇదిలా వుండగా తన భర్త సామ్రాట్ రెడ్డి ‘గే’ అని అంతేగాక, తనను ఆయన అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని హర్షిత ఫిర్యాదు చేసింది. తన పేరిట ఉన్న ఆస్తులను రాయించుకోవాలని చూస్తున్నాడని కూడా ఆమె ఆరోపించింది. అయితే అమె అరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని సామ్రాట్ పేర్కొన్నారు. తన ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి మాత్రమే ఇలాంటి అరోపణలు చేస్తున్నారని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telugu young hero  tollywood actor  Samrat Reddy  Arrest  Madapuru Police  Harshitha reddy  crime  

Other Articles