Shoe thrown at Asaduddin Owaisi in Mumbai హైదరాబాద్ ఎంపీ అసద్ పై బూటు దాడి.!

Shoe thrown at asaduddin owaisi in mumbai case filed

asaduddin owaisi, show hurled at owaisi, triple talaq bill, owaisi attacked, owaisi on triple talaq, AIMIM, elections, Corruption, civic issues, shoe thrown, Chief Justice of India, CJI, Dipak Misra, Karni Sena, Padmaavat, supreme court telangana, politics

AIMIM Chief Asaduddin Owaisi claimed that such incidents were happening at the behest of people, who follow "hate ideologies"."These are the same people who killed Gandhi, Dabholkar and Pansare," he added.

ITEMVIDEOS: హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పై బూటు దాడి.!

Posted: 01/24/2018 12:07 PM IST
Shoe thrown at asaduddin owaisi in mumbai case filed

ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి పరాభవం ఎదురైంది. ఆయనపై గుర్తుతెలియని అగంతకుడు పాట బూటును విసిరాడు. దీంతో ఆయన ప్రసంగిస్తున్న వేదికపై ఓ మూలన పడిన బూటతో అసద్ దృష్టిని మరల్చింది. వెంటనే వేదికపైకి చేరిన కొందరు నాయకులు బూటును పరిశీలిస్తుండగా వారిని వారించిన ఒవైసీ గమ్మునుండమని చెప్పి తన ప్రసంగాన్ని కొనసాగించాడు. ఈ ఘటన దేశ అర్థిక రాజధాని ముంబైలో దక్షిణభాగంలోని నాగ్ పదలో నిన్న రాత్రి జరిగిన ఓ బహిరంగసభలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ ముంబైలోని నాగ్ పదలో ట్రిపుల్ తలాక్ పై కేంద్రం తీసుకువస్తున్న నూతన బిల్లుకు వ్యతిరేకంగా ఆయన ముస్లింలను ఏకం చేసే కార్యక్రమాన్ని చేపట్టి బహిరంగ సభల ద్వారా అవగాహన కల్పిస్తుండగా రాత్రి 9,45 గంటలకు ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్ ను సాధారణ ప్రజలు, ముఖ్యంగా ముస్లింలు అంగీకరించడం లేదనే విషయాన్ని అధికారపక్ష నేతలు గుర్తించడం లేదని మండిపడ్డారు. వీళ్లంతా అసహనంతో ఉన్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవడం కోసం అవసరమైతే ప్రాణాలను సైతం పణంగా పెడతానని చెప్పారు.

మహాత్మాగాంధీ, నరేంద్ర దభోల్కర్, గోవిండ్ పన్సారేలను చంపిన హంతకుల భావజాలాన్నే తనపై బూటు దాడి చేసిన వారు కూడా అనుసరిస్తున్నారని అన్నారు. విద్వేష భావజాలంతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఇలాంటి వ్యక్తులు రోజురోజుకూ బలోపేతం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిజాలు మాట్లాడనీయకుండా ఇలాంటి దాడులు తనను అడ్డుకోలేవని చెప్పారు. దేశంలో 4 శాతం వున్న రాజ్ పుత్ లు పద్మావత్ సినిమాను అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని మరి 14 శాతం వున్న తాము తమకు వ్యతిరేకంగా వుస్తున్న బిల్లును ఎందుకు అడ్డుకోవద్దని ఒవైపీ ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Asaduddin Owaisi  AIMIM  elections  Corruption  civic issues  shoe thrown  telangana  politics  

Other Articles