Pawan Confirms his Political Journey | వీలైతే పాదయాత్ర.. లేకపోతే రోడ్ షో : పవన్ కళ్యాణ్

Janasenani pawan schedule

Jana Sena Party, Pawan Kalyan, Pawan Padayatra, Pawan Kalyan Kondagattu Yatra, Pawan Kalyan States Tour, Pawan Kalyan Political Journey

Jana Sena Party Chief Pawan Kalyan Explains Why he Starts his Padayatra From Kondagattu.

జనంలోకి జనసేనాని.. వీలైతే పాదయాత్ర, లేకపోతే రోడ్ షో

Posted: 01/21/2018 03:09 PM IST
Janasenani pawan schedule

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ యాత్ర వివరాలను ప్రకటించారు. రేపట్నుంచి తెలంగాణలో యాత్ర ప్రారంభమవుతుంది. తొలుత నాలుగు రోజులపాటు తెలంగాణలోని మూడు జిల్లాల్లో పర్యటిస్తానని పవన్ తెలిపారు. 2009లో జరిగిన ప్రమాదం నుంచి తనను ఆంజనేయస్వామే కాపాడాడని... అందువల్ల రేపు తొలుత కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని... అక్కడ నుంచి యాత్రను ప్రారంభిస్తానని చెప్పారు.

మూడు, నాలుగు జిల్లాల నేతలతో సమావేశమైన తర్వాత కొండగట్టులో తన యాత్ర పూర్తి వివరాలను వెల్లడిస్తానని తెలిపారు. వీలైతే పాదయాత్ర.. లేకపోతే బస్సుయాత్ర.. అవసరమైతే రోడ్ షో.. ఇలా వీలున్న మార్గాల్లో ప్రజల చెంతకు వెళతానని చెప్పారు. ప్రత్యేకించి విరామం అనేది ఉండదని తెలిపారు. ప్రజాసమస్యలను అధ్యయనం చేయడానికే ఈ యాత్రను చేపడుతున్నానని చెప్పారు. పాదయాత్ర చేస్తే ఎక్కువ మందిని కలిసే అవకాశం ఉండదని తెలిపారు. యాత్రలో భాగంగా ఎక్కడికక్కడ జనసేన కార్యకర్తలతో సమావేశమవుతానని చెప్పారు.

చర్చిలో పవన్ ప్రార్థనలు..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సికింద్రాబాద్ లోని సెయింట్ మేరీస్ చర్చిలో ఆదివారం ఉదయం ప్రార్థనలు చేశారు. పోలాండ్ అంబాసడర్ ఆడమ్ బురాకోవస్కీతో కలసి ఆయన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకే ఆయన తన భార్య అన్నాతో కలసి చర్చికి వెళ్లారు. తన రాజకీయ యాత్ర ప్రారంభానికి ముందు సర్వమత ప్రార్థనలు చేస్తానని పవన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆడమ్ బురాకోవస్కీతో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కార్యాలయంలో భేటీ కానున్నారు. ఆయనకు పవన్ దంపతులు సాదర స్వాగతం పలికారు. సమావేశం సందర్భంగా వీరిరువురూ పలు విషయాలపై చర్చించారు.

 

పోలండ్ అంబాసడర్ తో భేటీ...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పోలాండ్ దేశ అంబాసడర్ ఆడమ్ బురాకోవస్కీ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో వీరి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 20 మంది విద్యార్థులు కూడా సమావేశానికి హాజరయారు. గత నవంబర్ లో పవన్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లారు. ఆ సందర్భంగా కొందరు పోలాండ్ దేశస్తులు పవన్ ను కలిశారు. వారి ద్వారా పవన్ గురించి తెలుసుకున్న బురాకోవస్కీ... ఇప్పుడు ఆయనను కలిసేందుకు హైదరాబాద్ విచ్చేశారు.

బాగా చదవి ఉంటేనా... పవన్

తాను చదువులో ఫెయిలయ్యాయని, ఒకవేళ బాగా చదువుకుని ఉంటే ప్రొఫెసర్ ని అయ్యేవాడినని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విద్యార్థులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో ఆయన మాట్లాడుతూ.. పోలాండ్ దేశంతో భారత్ కు మంచి అనుబంధం ఉందని, పోలాండ్ చిత్రాలను దక్షిణ భారతదేశంలో చిత్రీకరించుకోవచ్చని అన్నారు. ఇప్పటికే పోలాండ్ చిత్రాలును దక్షిణ భారతదేశంలో చిత్రీకరించిన విషయాన్ని వారితో ప్రస్తావించారు. ఇందుకు, ఆడమ్ బురాకోవస్కీ స్పందిస్తూ, తమ దేశంలో కూడా ఇక్కడి సినిమాల షూటింగ్ లు జరుపుకోవాలని పవన్ ని కోరారు. ఈ సందర్భంగా రాజకీయాలపై పవన్ అభిప్రాయాన్ని ఆడమ్ బురాకోవస్కీ తెలుసుకున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles