టెలికాం రంగంలో వచ్చి సాంకేతిక విప్లవాన్ని అందుకున్న స్మార్ట్ ఫోన్లు.. రోజుకో అద్భుతంతో ప్రపంచాన్ని గుప్పిట్లోకి తీసుకొస్తున్న తరుణంలో.. మరో అద్భుత అవిష్కరణకు సామాజిక మాద్యమం వాట్సాప్ శ్రీకారం చుట్టనుంది. కేవలం ఒక్క బటన్ నొక్కడం ద్వారా వాయిస్ కాల్ ను వీడియో కాల్ గా మార్చివేయనుంది. త్వరలోనే ఈ అద్భుతాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు వాట్సాప్ పేర్కొనింది. ఇక అబద్దాల రాయుళ్ల అటలు కట్టివేయనుంది.
ఇన్నాళ్లు ఎక్కడో వుండి ఇక్కడే వున్నామని చెప్పే వారి ఆటలు సాగనివ్వకుండా వాట్సాప్ స్విచ్ పేరుతో అందుబాటులోకి తీసుకురాబోతున్న ఈ బటన్ సాయంతో ఒక వైపు వాయిస్ కాల్ మాట్లాడుతూనే, వీడియో కాల్కి మారే అవకాశం లభిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా వాయిస్ కాల్ కట్ చేసి, మళ్లీ వీడియోకాల్ చేయనవసరం లేదు. ప్రస్తుతం ఈ సదుపాయాన్ని బీటా వెర్షన్‌కి మాత్రమే పరిమితం చేశారు. త్వరలో రానున్న అప్డేట్ ద్వారా ఈ సదుపాయాన్ని అందరికీ కల్పించనున్నట్లు తెలుస్తోంది.
స్విచ్ బటన్ నొక్కినప్పటికీ అవతలి వ్యక్తి వీడియో కాల్ మాట్లాడటం ఇష్టం లేకపోతే... ఆ రిక్వెస్ట్‌ను తిరస్కరించి వాయిస్ కాల్‌లోనే కొనసాగే అవకాశం కూడా ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్న వాట్సాప్ ఈ మధ్య అనుకోకుండా ఓ ఫీచర్‌ని ఎనేబుల్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఫీచర్ సహాయంతో గ్రూప్‌లో ఎవరికైనా వ్యక్తిగతంగా రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఫీచర్‌ని వాట్సాప్ వెంటనే తొలగించింది. ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ని పూర్తిస్థాయిలో విడుదల చేయలేదు. త్వరలోనే గ్రూప్ ఇండివిడ్యువల్ రిప్లై ఫీచర్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more