SC to review 2013 order criminalizing gay sex స్వలింగ సంపర్కులలో చిగురిస్తున్న ఆశలు.

Supreme court to review 2013 order criminalizing gay sex

gay sex, criminalises gay sex, Section 377, decriminalising gay sex, homosexuality, LGBT, Supreme Court, Supreme Court judgment, 2013, privacy, right to privacy, Dipak Misra, Naz Foundation, national news

The first ray of hope for a fresh debate on decriminalising gay sex came in August last year when the top court in its right to privacy judgment said that sexual orientation is an essential attribute of privacy.

స్వలింగ సంపర్కులలో చిగురిస్తున్న ఆశలు.

Posted: 01/08/2018 03:46 PM IST
Supreme court to review 2013 order criminalizing gay sex

స్వలింగ శృంగారాన్ని నేరంగా పరిగణిస్తున్న ఇండియన్ పినల్ కోడ్ లోని సెక్షన్ 377ను సమీక్షించేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంగీకరించడంతో ఆ వర్గానికి చెందినవారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వలింగ సంపర్కం నేరమంటూ 2013లో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీం అప్పట్లో వెలువరించిన ఈ తీర్పును అప్పటి యూపీఏ ప్రభుత్వంలోని పెద్దలతో పాటు విపక్షాలలోని పలవురు ప్రముఖ నేతలు ఖండించారు.

కాగా, ఈ తీర్పు తమ ప్రాథమిక హక్కులను విఘాతం కలిగించేలా వుందని స్వలింగ సంపర్కులు మరోమారు సుప్రీంకోర్టును అశ్రయించగా.. నాటి తీర్పును సమీక్షించేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. దీనిపై స్పందన తెలియజేయాలంటూ కేంద్రానికి నోటీసులు పంపింది. గోప్యత అనేది ప్రాథమిక హ్కకులో భాగమేనంటూ ఇటీవల 'ఆధార్' విషయంలో సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. దీనిని ఆధారంగా చేసుకుని లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్ వర్గాలు (ఎల్‌జీబీజీక్యూ) సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
 
తాము సహజసిద్ధమైన లైంగిక అవసరాలు తీర్చుకునే విషయంలో పోలీసులకు భయపడాల్సి వస్తోందని వారు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. స్వలింగ సంపర్కం నేరమంటూ చెబుతున్న సెక్షన్ 377 కొట్టివేయాలని కోరాయి. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయూర్తులు ఎఎం ఖన్విల్కర్, డి.వై.చంద్రచూడ్‌లతో కూడిని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.

2013 డిసెంబర్‌లో ఇచ్చిన తీర్పు సహజసిద్ధమైన లైంగిక అవసరాల తీర్చుకునే వారి మనోభావాలను గాయపరిచినట్టు కనిపిస్తోందని బెంచ్ అభిప్రాయపడింది. దీనిపై కేంద్రం తన స్పందన తెలియజేయాలని ఆదేశించింది. సదరు పిటిషన్ ను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Section 377  Supreme Court  SC  LGBTQ  Lesbian gay transgender  Article 377  

Other Articles