At last Pradeep Attends Drunken Drive Case Counselling | డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు.. కౌన్సిలింగ్ కు ప్రదీప్.. రేపు తేలనున్న భవితవ్యం

Pradeep attends police counselling

Anchor Pradeep, Drunk and Drive, Counselling, Anchor Pradeep Magistrate, Anchor Pradeep Case

Anchor Pradeep is going to attend for Counselling in Drunken drive case at 11am, today. Police say that he might attend counselling with his mother. It is known that 2 cases were filed on Pradeep, drunken drive case, and a case for using dark glass for the car. Pradeep got escaped for few days after he had caught in drunken drive case, later he has released a selfie for apologizing people over his misbehaviour.

కౌన్సిలింగ్ కు హాజరైన ప్రదీప్.. రేపు తేలనున్న భవితవ్యం

Posted: 01/08/2018 07:25 PM IST
Pradeep attends police counselling

పీక‌ల‌దాకా తాగి కారు డ్రైవింగ్ చేస్తూ పోలీసుల‌కు దొరికిపోయిన యాంకర్ ప్ర‌దీప్ ఎట్ట‌కేల‌కు కౌన్సెలింగ్‌కు హాజ‌ర‌య్యాడు. కొన్ని రోజులుగా ప్ర‌దీప్ క‌నపడ‌కుండా పోయిన విష‌యం తెలిసిందే. మ‌రోసారి అలా చేయ‌బోన‌ని ఓ వీడియో కూడా విడుద‌ల చేశాడు. ఆయ‌న రెండు రోజుల్లోగా కౌన్సెలింగ్‌కు రాక‌పోతే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు ఇటీవ‌ల హెచ్చ‌రిక కూడా చేశారు. ఈ క్రమంలో ఈ రోజు ప్ర‌దీప్‌ హైద‌రాబాద్‌లోని గోషామహల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి కూర్చున్నాడు.

పెళ్లికాని వారు త‌ల్లిదండ్రుల‌తో, పెళ్ల‌యినా వారు భార్య‌తో క‌లిసి కౌన్సెలింగ్‌కు రావాల‌ని చెప్పిన నేప‌థ్యంలో.. ప్ర‌దీప్ త‌న తండ్రితో కలసి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇక కౌన్సెలింగ్‌లో మిగతా వారితో పాటు ప్ర‌దీప్ కూర్చుని పోలీసులు చెప్పే సూచ‌న‌లను మూడు గంటలపాటు శ్ర‌ద్ధ‌గా విన్నాడు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు ఎంతో శ్ర‌ద్ధ తీసుకుని, ఓపిక‌గా తాగుడు వ‌ల్ల వ‌చ్చే అనర్థాల‌ను వివ‌రించార‌ని అన్నాడు. తాగి న‌డ‌ప‌డం వ‌ల్ల యాక్సిండెట్లు జ‌రుగుతోన్న తీరును, తాగితే మ‌నిషి ప్రవ‌ర్తించే వైఖ‌రిని చెప్పార‌ని అన్నారు. తాగిన‌ప్పుడు డ్రైవింగ్ సీట్లో కూర్చోవ‌ద్ద‌ని అన్నారని ప్రదీప్ చెప్పాడు. తాను మ‌రోసారి ఈ త‌ప్పు చేయ‌బోన‌ని అన్నాడు. బాధ్య‌త‌గ‌ల వ్య‌క్తిగా తాను పోలీసుల విచార‌ణ‌కు స‌హ‌క‌రించాన‌ని అన్నాడు. తాను షూటింగుల్లో బిజీగా ఉన్న కార‌ణంగానే తాను లేటుగా వ‌చ్చాన‌ని, అంతే త‌ప్ప తానేం పారిపోలేద‌ని చెప్పుకొచ్చాడు.

సాధార‌ణ మ‌నిషి ఎలాగైతే కౌన్సెలింగ్‌కు హాజ‌ర‌వుతాడో తాను కూడా అలాగే హాజ‌ర‌య్యాన‌ని అన్నాడు. తాను చేసిన త‌ప్పుని ఎవ్వ‌రూ చేయ‌కూడ‌ద‌ని ప్రదీప్ హిత‌వు ప‌లికాడు. అయితే 100 మిల్లిగ్రామ్ ల కంటే శిక్ష తప్పదు. రేపు మెజిస్ట్రేట్ ఎదుట ప్రదీప్ మరోసారి హాజరవుతాడు. ఈ నేపథ్యంలో 178 మిల్లీ గ్రాములతో పట్టుబడ్డ ప్రదీప్ కు ఫైన్ తో సరిపెడుతుందా? లేక జైలు శిక్ష విధిస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles