navik jobs for inter students.. ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్ ఉద్యోగాలు...

Indian coast guard invites online application for navik posts

Indian Coast Guard, indian coast line protection, indian coast line defence, navik, general navik jobs, safeguard coast, India’s marine jobs, coast guard career, navik job

Indian Coast Guard has invited online application for the post of Navik(General Duty) 10+2 Entry – 02/2018 Batch. Apply online before 02-Jan-2018.

ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్ ఉద్యోగాలు...

Posted: 12/27/2017 04:43 PM IST
Indian coast guard invites online application for navik posts

ఇంటర్మీడియట్ లో ఎంపీసీ చదివిన అసక్తిగల విద్యార్థుల నుంచి ఇండియన్ కోస్ట్ గార్డు ధరఖాస్తులు కోరుతుంది. మ్యాథ్స్, ఫిజిక్స్ లలో సుమారు 50 శాతం మార్కులు సంపాదించిన అసక్తిగల విద్యార్థులు నావిక్‌ (జనరల్‌ డ్యూటీ) పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఇండియన్‌ కోస్ట్‌ గార్డు ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. రాత, శరీరదారుడ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైన వారికి ఆగస్టు నుంచి శిక్షణ మొదలవుతుంది. ప్రారంభంలోనే నెలకు రూ.35,000 వరకు వేతనం పొందవచ్చు.

విద్యార్హతలు:-
50 శాతం మార్కులతో ఇంటర్‌ / +2 ఎంపీసీ గ్రూప్‌తో ఉత్తీర్ణులై వుండాలి. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ల్లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి.

వయోపరిమితులు:-
కనిష్ఠం 18 ఏళ్లు, గరిష్ఠం 22. ఆగస్టు 1, 1996 - జులై 31, 2000 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయఃపరిమితి సడలింపు ఉంది.

రాత పరీక్ష ఇలా..
ఈ పరీక్షను ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇంటర్‌ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలతో పాటు ఆంగ్లభాషా పరిజ్ఞానం, జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. రాత పరీక్షలో అర్హత సాధించినవారికి శరీరదారుడ్య పరీక్షలు నిర్వహిస్తారు.

శరీరదారుడ్య అర్హతలు:
అభ్యర్థి ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ కొలత వ్యత్యాసం కనీసం 5 సెం.మీ. ఉండాలి. ఈ విభాగంలో అర్హత సాధించడానికి 7 నిమిషాల్లో 1.6 కి.మీ. దూరం పరుగెత్తాలి. 20 గుంజీలు, 10 పుష్అప్ లు తీయగలగాలి. పీఈటీలో అర్హత పొందితే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. స్పష్టమైన కంటిచూపు ఉండాలి, వినికిడిలోపం ఉండకూడదు.
అభ్యర్థుల వివరాలను రాతపరీక్ష సమయంలో పరిశీలిస్తారు. పరీక్షకు వెళ్లేటప్పుడే పదోతరగతి, ఇంటర్‌ ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఫొటోలు, ఏదైనా ఐడీ, సర్టిఫికెట్ల నకళ్లు తీసుకెళ్లాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే కుల ధ్రువీకరణ పత్రాన్ని తీసుకెళ్లాలి. వీటిని పరిశీలించిన తర్వాతే పరీక్షకు అనుమతిస్తారు.

తుది ఎంపిక:
రాతపరీక్ష, పీఈటీ, మెడికల్‌ టెస్టుల్లో ఉత్తీర్ణులైన వారితో తుది నియామకాలు చేపడతారు. ఎంపికైనవారి వివరాలను జులైలో కోస్ట్‌గార్డు వెబ్‌సైట్‌లో ఉంచుతారు. ప్రాథమిక శిక్షణ ఆగస్టు నుంచి ఐఎన్‌ఎస్‌ చిల్కలో ప్రారంభమవుతుంది. ఇక్కడ మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పోస్టింగు ఇస్తారు. విధుల్లో చేరినవారికి రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్సులు అదనం. వేతనంతోపాటు పలు ఇతర ప్రయోజనాలు (క్యాంటీన్‌, వసతి, దుస్తులు, ఎల్‌టీసీ...మొదలైనవి) ఉంటాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles