cheque books of SBI account holders to be invalid స్టేట్ బ్యాంకు ఖాతాదారులా..? 3 రోజులే మిగిలింది..!

Cheque books of these banks to be invalid after december 31

State Bank of India, SBI Cheque books, SBI New Cheque books, State Bank Of India, sbi news, SBI new IFSC, SBI, IFSC SBI, trending news

State Bank of India (SBI) asked the customers of its subsidiary banks to apply for new cheque books along with Indian Financial System Code (IFSC) "as soon as possible".

స్టేట్ బ్యాంకు ఖాతాదారులా..? 3 రోజులే మిగిలింది..!

Posted: 12/27/2017 03:52 PM IST
Cheque books of these banks to be invalid after december 31

అసియాలోనే అతిపెద్ద బ్యాంకుగా అవతరించి.. ప్రపంచ అతిపెద్ద బ్యాంకుల జాబితాలో టాప్ 10 స్థానం సంపాదించిన భారతీయ స్టేట్ బ్యాంకు(స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా) .. ఏకంగా ఆరు బ్యాంకులను విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనలో విలీనమైన బ్యాంకులకు సంబంధించిన చెక్ బుక్ లు ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి చెల్లనేరవన్న విషయం తెలుసా..? మరో మూడు రోజుల్లో మీ పాత బ్యాంకులు జారీ చేసిన చెక్ బుక్కులు, ఐఎఫ్ఎస్సీ కోడ్ లు చెల్లవు.

తమ పాత బ్యాంకులకు చెందిన చెక్ బుక్కులు, ఐఎఫ్ఎస్సీ కోడ్ ల స్థానంలో కొత్త చెక్ బుక్కులను స్టేట్ బ్యాంకు అప్ ఇండియా అందించనుంది. ఖాతాదారులు ఇబ్బంది పడకుండా తమ పాత చెక్ బుక్ లను మార్చుకోవాలని, ఐఎఫ్ఎస్ సీ కోడ్ లను తెలుసుకోవాలని స్టేట్ బ్యాంకు తన ఖాతాదారులకు సూచించింది. వాస్తవానికి పాత్ చెక్ బుక్ లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30వ తేదీని ఎస్బీఐ గడువుగా నిర్ధారించింది. ఆ తర్వాత గడువును డిసెంబర్ 31కు పొడిగించింది.

ప్రస్తుతం గడువు దగ్గర పడుతుండటంతో... ఎస్బీఐ మరోసారి సూచన చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ రాయ్ పూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్ సహా భారతీయ మహిళా బ్యాంకులు ఎస్బీఐలో విలీనమయ్యాయి. కొత్త చెక్ బుక్ లను పొందడానికి బ్యాంకు శాఖను సంప్రదించవచ్చని, లేకపోతే ఏటీఎం, ఎస్బీఐ మొబైల్ యాప్ ద్వారానైనా వీటిని పొందవచ్చని ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SBI Cheque books  State Bank Of India  sbi news  SBI new IFSC  SBI  IFSC SBI  trending news  

Other Articles