32 killed in Rajasthan bus accident ఆ బస్సును నడిపింది 16 ఏళ్ల కుర్రాడు..

32 killed as bus falls off bridge into river in rajasthan

sawai madhopur accident, road accident, Rajasthan bus accident, fatal accident, Bus accident, Maman Singh, PM Modi, sawai modhapur, dubi, 16 year conductor, bus driver, Malana Dabi, pilgrimage

At least 32 people were killed and several others injured when a bus fell into the Banas river from an 100-foot high bridge in Rajasthan's Sawai Madhopur. It was being driven by a 16-year-old conductor who was speeding and lost control over the vehicle

రాజస్థాని ఘోరకలికి కారణం 16 ఏళ్ల కుర్రాడు..

Posted: 12/23/2017 05:01 PM IST
32 killed as bus falls off bridge into river in rajasthan

రాజ‌స్థాన్ లో జరిగిన ఘోర ప్రమాదానికి కారణం 16 ఏళ్ల కుర్రాడు. డ్రైవర్ నిర్లక్ష్య ధోరణి కారణంగా 16 ఏళ్ల కుర్రాడికి బస్సు నడిపేందుకు అనుమతించడంతో 32 మంది బలయ్యారు. ఇవాళ ఉదయం తీర్థయాత్రకని వెళ్లి వస్తున్న బస్సును నడిపిన 16 ఏళ్ల కుర్రాడు.. బస్సు కండక్టర్ గా పనిచేస్తున్నాడని పోలీసుల ప్రాథమిక సమాచారంలో తేలింది. స‌వాయ్ మాధోపూర్ దుబి ప్రాంతంలో వంతెనపై నుంచి ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న బ‌స్సు అదుపు త‌ప్పి వంతెన పై నుంచి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది.

వంతెనపై నుంచి బస్సు వెళ్తున్నప్పుడు వేగంగా నడిపిన కుర్రాడు.. బస్సును నియంత్రించడంలో విఫలమయ్యాడు. దీంతో బస్సు అదుపుతప్పి న‌దిలో ప‌డి పోవ‌డంతో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గరు గల్లంతయ్యారు. పలువురు ప్రయాణికులకు గాయాల‌య్యాయి. సమాచారం అందుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించిన పోలీసులు, రెస్క్యూ బృందాలు గాయ‌ప‌డ్డ‌ వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందజేస్తున్నారు.

ఇవాళ తెల్లవారు జామున జరిగిన ఈ బ‌స్సు ప్రమాదానికి కారణం.. బస్సు డ్రైవరేనని ప్రత్యక్ష సాక్షులు అరోపిస్తున్నారు. లాల్ సోత్ ప్రాంతం నుంచి స‌వాయ్‌ మాధోపూర్ కు బస్సు వచ్చింద‌ని, ఆ బ‌స్సును న‌డిపే డ్రైవ‌ర్.. 16 ఏళ్ల కుర్రాడైన కండ‌క్ట‌ర్‌ని డ్రైవ‌ర్ సీట్లో కూర్చోబెట్టి బ‌స్సు న‌డ‌ప‌మ‌ని చెప్పి, డ్రైవర్ ప‌డుకున్నాడ‌ని పోలీసులు తెలిపారు. స్టీరింగ్ అదుపు తప్పడం వల్ల ఈ ప్రమాదం జరిగింద‌ని ప్రాథమికంగా నిర్ధారించిన‌ట్లు తెలిపారు.

కాగా ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్ కూడా మరణించారని పోలీసులు తెలిపారు. ఈ బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ప్ర‌ధాన‌ మంత్రి న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన తన హృదయాన్ని కలిచివేసిందని అన్నారు. ప్రమాద ఘటనపై ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం స‌హాయ‌క చ‌ర్య‌లు మొద‌లు పెట్టింద‌ని ట్వీట్ చేశారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  sawai modhapur  dubi  16 year conductor  bus driver  Malana Dabi  pilgrimage  Bus accident  crime  

Other Articles