BJP's Film Would be Called 'Lie Hard': Rahul Gandhi మోదీ ప్రభుత్వానికి రాహల్ మరో పేరు

Bjp s film would be called lie hard rahul gandhi

BJP, congress, Congress president, Die Hard, Narendra Modi, pm modi, Rahul Gandhi, #BJPLieHardయ #BJPLiesయ #HowManyBJPLies, politics

Taking to Twitter after chairing the first meeting of the Congress Working Committee (CWC), Rahul wrote, "If BJP had a film franchise it would be called Lie Hard #BJPLieHard #BJPLies #HowManyBJPLies."

మోదీ ప్రభుత్వానికి రాహల్ మరో పేరు

Posted: 12/23/2017 04:13 PM IST
Bjp s film would be called lie hard rahul gandhi

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంపై మరోమారు ఘాటైన విమర్శలు చేశారు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ. మోడీ ప్రభుత్వం అచ్చంగా హాలీవుడ్ చిత్రాన్ని తలపిస్తున్నట్లు వుందని వ్యంగవ్యాఖ్యలు చేశారు. మోదీది 'లై హార్డ్‌' ప్రభుత్వం అని వెటకార వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా హాలీవుడ్ మూవీ డైహార్డ్ సిరీస్ మాదిరిగా మోదీ కూడా లైహార్డ్ సిరీస్ ను కొనసాగిస్తున్నారని అన్నారు.

దేశానికి ప్రధానిగా హుందాగా వుండాల్సిన మోదీ ఒక 'అబద్ధాల వాస్తుశిల్పి' అన్నారు. చాలా పకడ్బందీగా నిర్మాణాత్మకంగా ఆయన అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ఊటంకిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ ప్రచారం చేస్తున్నట్లుగా గుజరాత్‌ మోడల్‌ అంటూ లేనే లేదని, చెప్పినవన్నీ అబద్ధాలేనని రాహుల్ విమర్శలు చేశారు.

ఆ విషయం గుజరాత్‌ పర్యటన చేసిన వారందరికీ కళ్లకు కటుతుందని చెప్పారు. గుజరాత్ అభివృద్ది నిజమే అయితే.. వారు దానిని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎందుకు వాడుకోలేదని ఆయన ప్రశ్నించారు. 'ఒక వేళ బీజేపీ చిత్ర నిర్మాణ సంస్థగా ఉన్నట్లయితే దానిని అప్పుడు కచ్చితంగా లైహార్డ్ అని పిలవాలి' అంటూ ట్వీట్ చేశారు. ఇక 2జీ స్కాం తీర్పును ఉటంకిస్తూ ' ఇప్పుడు మీకు 2జీ గురించి పూర్తి నిజం తెలుసు. నిజం ఇప్పుడు మీ ముందు ఉంది' ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  congress  Congress president  Die Hard  Narendra Modi  pm modi  Rahul Gandhi  

Other Articles