TDP Leaders Ripped Woman Clothes in Vizag | నేతల కీచక పర్వం.. విశాలో మహిళ బట్టలను చించారు

Tdp leaders ripped woman clothes in vizag

Vishakapatnam, Pendurthi, Land Grabbing, TDP Leaders, Dalit Woman, Ripped Clothes, MLA Bandaru Satyanarayana Murthy

TDP Leaders Ripped Dalit woman clothes in Vishakapatnam. The Woman try to Protest Land Grabbing which allocated to Dalit years back. Woman complained at Pendurthi MLA Bandaru Satyanarayana Murthy's Aides.

విశాఖలో దళిత మహిళపై దాషీక్టం

Posted: 12/20/2017 10:21 AM IST
Tdp leaders ripped woman clothes in vizag

విశాఖ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన ఒకటి చోటు చేసుకుంది. పెందుర్తి నియోజకవర్గంలో కొందరు నేతలు రాక్షసంగా వ్యవహరించారు. దళిత మహిళను వివస్త్రను చేసి ఘోరంగా అవమానించారు. బండ బూతులు తిడుతూ ఇతర దళితులను వెంటాడి కొట్టారు. ఈ ఘటనపై మంగళవారం బాధితులు పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఘటన వెలుగులోకి వచ్చింది.

దళితుల భూమిని ‘ఎన్టీఆర్‌ గృహకల్ప’ పేరుతో ఆక్రమించుకునేందుకు కొందరు టీడీపీ నేతలు యత్నించారు. దీనిని అడ్డుకునేందుకు ఆ మహిళ ప్రయత్నించగా.. అడ్డుకుందన్న కారణంతో దుస్తులు చింపేసి ఈడ్చేశారు. పెందుర్తి వైస్‌ ఎంపీపీ మడక పార్వతి, ఆమె భర్త, టీడీపీ నేత మడక అప్పలరాజు, మాజీ సర్పంచ్‌ వడిశల శ్రీను, టీడీపీ నాయకులు సాలాపు జోగారావు, రాపర్తి గంగమ్మ, మడక రాము నాయుడి పేర్లను బాధితురాలు ఫిర్యాదులో ప్రస్తావించారు. నిందితులంతా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అనుచరులు కావడంతో కేసు నమోదుకు పోలీసులు వెనుకాడుతన్నట్లు సమాచారం.

అసలు విషయం ఏంటంటే..

పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెం సర్వే నంబరు 77లో ఉన్న భూమిని కొన్నేళ్ల క్రితం స్థానిక దళిత కుటుంబాలకు కేటాయించారు. తరువాత కొన్నాళ్లకు అదే భూమిలో ఏపీ బేవరేజేస్‌ బాట్లింగ్‌ కంపెనీకి కొంత స్థలం ఇచ్చారు. అదికాకుండా మిగిలిన 80 సెంట్ల స్థలాన్ని 14 దళిత కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయి. కొన్నాళ్ల క్రితం విలువైన ఈ స్థలం కబ్జా చేసేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించగా... దళితులు ఆ సమయంలో హైకోర్టును ఆశ్రయించారు. తీర్పు వారికి అనుకూలంగా వచ్చింది. ఇప్పుడు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇదే స్థలాన్ని టీడీపీ మద్దతుదారులకు కేటాయించేలా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles