shambhu lal claims mistaken identity in love jihad case లవ్ జిహాద్ హత్యకేసులో ట్విస్టు.. అమాయకుడు బలి..

Man who burnt alive a person now claims it was a case of mistaken identity

Rajasthan Love Jihad, Mohammed Afrazul, Mohammed Afrazul Murder, Rajasthan, Rajsamand, Mohammad Afrazul, Shambhulal Regar, Rajsamand murder, Rajasthan, crime

Shambhulal Regar, the man who was arrested for the murder on December 7, for murdering ashraful instead of azhu who influenced her sister in the name of love jihad.

లవ్ జిహాద్ హత్యకేసులో ట్విస్టు.. అమాయకుడు బలి..

Posted: 12/19/2017 08:42 PM IST
Man who burnt alive a person now claims it was a case of mistaken identity

రాజస్థాన్‌ లో సంచలనంగా మారిన లవ్ జిహాద్‌ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు షాకింగ్ విషయాలను కనుగొన్నారు. తమ సోదరిని ప్రేమించిన వాడిని కాకుండా వేరే వ్యక్తిని నిందితుడు చంపేశాడని పోలీసులు దర్యాప్తులో వెలుగుచూసింది. తన సోదరిని ప్రేమలో దింపిన అజ్జో అనే వ్యక్తిని చంపేందుకు బదులు అఫ్రజుల్ అనే వ్యక్తిని పోరబాటున చంపేశాడు శంభులాల్. రాజ్‌సమంద్‌ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం కేసు వివరాలు ఇలా వున్నాయి.

రెగర్ మొహల్లా ప్రాంతానికి చెందిన యువతి మహమ్మద్ బబ్లూ షేక్ అనే వ్యక్తితో 2010లో వెళ్లిపోయింది. మాల్దాలో ఉంటున్న ఆమెను వెనక్కి రప్పించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించగా కుదరలేదు. దీంతో ఆమెను సోదరిగా చెప్పుకునే శంభులాల్‌ రంగంలోకి దిగాడు. తానే స్వయంగా వెళ్లి ఆమెతో మాట్లాడి వెనక్కి రప్పించాడు. పశ్చిమ బెంగాల్ కు చెందిన అజ్జు రాజస్థాన్ ప్రాంతానికి వచ్చి స్థిరపడి కూలి పనులు చేసుకునేవాడు. అయితే కొంత కాలానికే అజ్జూ అనే మరోవ్యక్తి ఆమెను తిరిగి మాల్దాకు తీసుకెళ్లాడు.

దీంతో మరోసారి ఆమెతో ఫోన్ లో మాట్లాడి వెనక్కి రప్పించేందుకు యత్నించగా.. అజ్జూ-శంభు ఫోన్ లోనే వాదులాడుకున్నారు. తర్వాత ఏం జరిగిందోగానీ యువతి స్వచ్ఛందంగా ఇంటికి వచ్చేసింది. చివరకు నాలుగైదు నెలల క్రితం అజ్జూ మళ్లీ ఆమె కోసం తమ వీధిలోకి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న శంభు ఇక అజ్జూను చంపేయటమే మార్గమని నిర్ణయానికి వచ్చాడు. ఈ క్రమంలో అజ్జూ కోసం శంభు వేట ప్రారంభించాడు. అజ్జు మాదిరిగానే అఫ్రోజ్ కూడా మాల్దా నుంచి వచ్చి స్థిరపడి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

అసలు విషయం తెలీని ఓ వ్యక్తి.. కూలి పనుల కోసం అజ్జు నెంబరును శంభులాల్ అడుగుతున్నాడని భావించి.. అతనికి బదులు అఫ్రోజ్ కు అవసరం ఎక్కువగా వుందని, అతని నెంబరును ఇచ్చాడు. అప్పటిదాకా అజ్జూతో శంభుకి ముఖపరిచయం లేకపోవటం.. ఫోన్ లో కూడా అజ్జూ గొంతును గుర్తుపట్టకపోవటంతో.. అన్నింటికి మించి అతని వివరాలను కూడా తెలుసుకోవటానికి శంభు ఆసక్తి చూపలేదు. డిసెంబర్ 6న ఉదయం అఫ్రోజ్ కు ఫోన్ చేసి ప్రహరిగోడ పనుల కోసం మాట్లాడేందుకు రావాలంటూ శంభు పిలిచాడు.

దీంతో వీరిద్దరూ కలుసుకుని పనుల గురించి మాట్లాడుకున్నారు. ఆపై పని ప్రాంతం చూపిస్తానంటూ కిలో మీటర్‌ దూరం తీసుకెళ్లి అక్కడ అఫ్రోజుల్‌పై దారుణానికి తెగబడ్డారు. ఆ తతంగం అంతా వీడియో తీసి అప్‌లోడ్‌ చేశాడు. అసలు విషయం పక్కదారి పట్టేందుకు అతను మతద్వేషిగా అభివర్ణించుకుంటూ వీడియోలను అప్‌లోడ్‌ చేశాడంటూ పోలీసులు వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajsamand  Mohammad Afrazul  Shambhulal Regar  Rajsamand murder  Rajasthan  crime  

Other Articles