TDP Leaders Tension with Chandrababu latest statement | టీడీపీ నేతలను మానసిక సంక్షోభానికి గురి చేస్తున్న బాబు

Tdp no take chances in 2019 elections

Telugu Desam Party, 2019 Elections, N Chandrababu Naidu, Seat Allocations, TDP General Meeting, Chandrababu Favourism,

Telugu Desam Party is not taking any chances to lose 2019 Andhra Pradesh Assembly elections. Chief Minister N Chandrababu Naidu has listed a multi-point formula to be pursued by the party. He Clarified that no seats for Favour leaders in upcoming elections.

సొంత నేతలను టెన్షన్ పెడుతున్న ఏపీ సీఎం

Posted: 12/13/2017 10:57 AM IST
Tdp no take chances in 2019 elections

మూడున్నరేళ్ల పాలనపై విమర్శలు.. పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రజల్లో పెరిగిపోతున్న అసంతృప్తి.. మిత్ర పక్షం అయినప్పటికీ బాబుపై పెదవి విరుస్తున్న బీజేపీ... క్రమక్రమంగా బలపడుతున్న ప్రతిపక్షాలు. ఇన్నీ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సీట్ల కేటాయింపుల పై దృష్టిసారించటం పార్టీ నేతల్లో కలవరపాటుకు గురిచేస్తోంది. మొహమాటాలకు పోయి ఎవరికీ టికెట్లు ఇచ్చే పరిస్థితి తెచ్చుకోబోనని మంగళవారం నిర్వహించిన సమన్వయ కమిటీలో చంద్రబాబు స్పష్టంగా చెప్పేశారు.

పదవుల వద్ద సాన్నిహిత్యాన్ని చూడబోనని, సన్నిహితులని భావిస్తే, ఇంటికి పిలిచి అన్నం పెడతానే తప్ప, టికెట్లు ఆఫర్ చేయబోనని తెగేసి చెప్పినట్లు సమాచరాం. అన్ని నియోజకవర్గాల నుంచి కేవలం పార్టీ ఇస్తున్న సమాచారంపై మాత్రమే ఆధారపడటం లేదని, తనకున్న వివిధ మార్గాల ద్వారా కూడా సమాచారాన్ని తెప్పించుకుని సమీక్షిస్తున్నానని ఆయన చెప్పారంట. సీనియర్లు కూడా అందుకు అతీతం కాదని.. గెలిచే అవకాశాలు ఉన్న వారినే బరిలో దింపుతామని ఆయన తేల్చేశారు. వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపులు వాటి ఆధారంగానే ఉంటాయని కూడా చెప్పటంతో తదుపరి ఎన్నికల్లో కూడా సీట్లు ఆశిస్తున్న వారు మానసిక వేదనకు గురవుతున్నారు.

ఇదే సమయంలో వైకాపా నుంచి ఫిరాయించిన ప్రతి ఎమ్మెల్యేకూ తదుపరి ఎన్నికల్లో చాన్స్ ఇస్తానని చంద్రబాబు నుంచి హామీ లభించినట్లు ఓ వార్త చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అదే జరిగితే, ఆయా నియోజకవర్గాల్లో తమ పరిస్థితి ఏంటని గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ నేతలు.. పార్టీ కోసం పని చేస్తున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వారు పార్టీలు మారే అవకాశాలు ఉన్నాయన్నది విశ్లేషకుల వాదన.

ఇక ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంతో ప్రభుత్వంపై విమర్శలు కొంత మేరకు తగ్గాయని, అయితే, ప్రస్తుతమున్న 54 శాతం ప్రజా సంతృప్త స్థాయిని డిసెంబర్ నాటికి 59 శాతానికి తీసుకెళ్లాలని చంద్రబాబు తన ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులకు సూచించారంట. ముఖ్యంగా అగ్రిగోల్డ్ సమస్య, నిరుద్యోగ భృతి, ఫాతిమా కళాశాల విద్యార్థుల సమస్యలు, కడప స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు వంటి వాటిని ఒక్కొక్కటిగా ఎన్నికల నాటికి పూర్తి చేద్దామని నిర్ణయించుకున్నట్టు ఆయన వెల్లడించారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles