mla activists thrashed youth after suspecting eggs attack ఎమ్మెల్యేపై కోడిగుడ్ల దాడి.. చితకబాదిన అనుచరులు..

Mla activists thrashed youth after suspecting eggs attack

prakasham district, defected mla, ashok reddy, ysrcp, tdp, party activists, youth, suspects, eggs attack on mla. ardharvedu mandal, velagalapaya village, andhra pradesh

prakasham district defected mla ashok reddy activists thrashed few youth suspecting they have attacked mla with eggs. ardharvedu mandal velagalapaya village has witnessed this scene.

ఎమ్మెల్యేపై కోడిగుడ్ల దాడి.. చితకబాదిన అనుచరులు..

Posted: 12/13/2017 10:36 AM IST
Mla activists thrashed youth after suspecting eggs attack

ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు పరాభవం ఎదురైంది. అధికార పార్టీ తరపున క్రితం రోజున ఆయన తన నియోజకవర్గంలో పర్యటిస్తుండగా ఆయనపై కొందరు గుర్తు తెలియని యువకులు దాడికి పాల్పడ్డారు. అది కోడిగుడ్లతో. దీంతో ఒక్కసారిగా అనూహ్య పరిణామం చవిచూసిన ఎమ్మెల్యే ఖంగుతిన్నారు. వెంటనే తేరుకున్న ఆయన అనుచరులు, కొడిగుడ్ల దాడికి పాల్పడ్డారన్న అనుమానంతో కొందరు యువకులను పట్టుకుని చితకబాదారు.

విపక్ష పార్టీ వైసీపీ తరపున గెలిచిన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి తన నియోజకవర్గంలోని అర్థవీడు మండలం, వెలగలపాయ గ్రామంలో క్రితం రోజున ఇంటింటికీ టీడీపీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభలో మాట్లాడుతున్న ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడిచేశారు. హఠాత్పరిణామంతో ఖంగుతిన్న ఆయన.. తేరుకునే లోపు అయన అనుచరులు, గ్రామ సర్పంచ్.. ఆ దాడికి చేసిన వారి కోసం వెతికారు.

గుడ్ల దాడితో సభలో ఒక్కసారిగా అలజడి రేగింది. అయితే ఎవరూ కనిపించకపోవడంతో.. వైసీపీ పార్టీకి చెందిన సానుభూతిపరులుగా వున్న పలువురు యువకులను వారు పట్టుకుని వచ్చి వారే దాడి చేసి వుంటారన్న అనుమానంతో వారిని చితకబాదారు. అలాగే కోడిగుడ్లు విసిరారన్న అనుమానంతో గ్రామ సర్పంచ్ బంధువులు నలుగురు యువకులపై దాడి చేశారు. నిందితులపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించినట్టు తెలుస్తోంది. కాగా, తమను అకారణంగా కొట్టారని బాధిత యువకులు కూడా పోలీసులను ఆశ్రయించారని సమాచారం. పోలీసులు మాత్రం మద్యం మత్తులో యువకులు పరస్పరం కోడిగుడ్లు విసురుకున్నారని, తామెవరినీ అదుపులోకి తీసుకోలేదని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prakasham district  defected mla  ashok reddy  ysrcp  tdp  eggs attack on mla.andhra pradesh  

Other Articles