RaGa Elected Party President Unopposed రాహుల్ ఎన్నికయ్యాడు.. 16నే అధికార పగ్గాలు..

Celebrations at 24 akbar road raga elected congress president

congress, Congress chief, Congress elections, congress presidents, Grand Old Party, history of congress, Mullapally Ramachandran, Priyanka Gandhi, Rahul Gandhi, Sonia Gandhi

Rahul Gandhi has become the Congress President-elect with the deadline to withdraw nomination for internal polls ending at 3pm. Gandhi, however, may officially take charge on December 16

ITEMVIDEOS: రాహుల్ ఎన్నికయ్యాడు.. 16నే అధికార పగ్గాలు..

Posted: 12/11/2017 04:04 PM IST
Celebrations at 24 akbar road raga elected congress president

గత దశాబ్దకాలంగా ఆయన పార్టీలో యువనేత. మరోలా చెప్పాలంటే బీజేపీ సహా దాని మిత్రపక్షాలు విమర్శించేట్లుగా యువరాజు. అయితే అదే యువరాజు చేతికి ఇవాళ పాలనాబాధ్యతలు మోసే రాజు స్థాయికి పదోన్నతి సంపాదించారు. రాహుల్ గాంధీ ఇవాళ అధికారికంగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి నామినేషన్‌ తిరస్కరణ గడువు సోమవారంతో ముగిసింది. రాహుల్‌ మినహా ఎవరూ నామినేషన్‌ వేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్‌ ఎం. రామచంద్రన్‌ ప్రకటించారు. అయితే ఈ నెల 16న రాహుల్‌ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు లాంఛనంగా చేపట్టనున్నట్టు వెల్లడించారు.

డిసెంబర్‌ 16న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రంలో తాము విజయబావుటా ఎగురవేస్తామని ముందునుంచి అంచనాలు పెట్టుకున్న కాంగ్రెస్.. అదే రోజున రాహుల్ కూడా పట్టాభిషేకుణ్ణి చేయడానికి కంకణం కట్టుకుంది. రెండు దశాబ్దాల కాషాయపార్టీ తరువాత గుజరాత్ లో కాంగ్రెస్ జెండాను అవిష్కరించనున్నామన్న ధీమా ఆయా వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో అదే రోజు రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలు చేపట్టనున్నారు.

సోనియాగాంధీ, ఇతర సీనియర్ నేతల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నికైన రాహుల్ కు ధ్రువపత్రాన్ని అందించనున్నారు. నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న ఐదోవ్యక్తి రాహుల్‌. 2004లో రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన రాహుల్‌ అప్పటి నుంచి వివిధ విభాగాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 2007లో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ సారథ్య బాధ్యతలు నిర్వర్తించారు.

2008లో కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్థి రాహుల్‌ అనే నినాదాన్ని కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. అనంతరం 2013లో రాహుల్‌ ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యతలను ఈ యువ‌నేత‌ త‌న‌ భుజాన వేసుకున్నారు. కాగా ప్రభుత్వ వ్యతిరేకత మూలంగా పార్టీ ఓటమిని చవిచూసింది. రాహుల్ గాంధీ పార్టీ సారధీగా ఎన్నిక కావడంతో 24 అక్బర్ రోడ్డులో సంబరాలు మిన్నంటాయి. అభిమానులు మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకుంటున్నారు. టపాసులు పేల్చుతూ తమ అనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఆయన రాజకీయాలలో ఇప్పటికే ఎన్నో అటుపోట్లు తిన్నారు.. ఆయన యువనేతగా అభివర్ణిస్తూనే.. బంగారు పాన్పుపై పుట్టిన పాపాయి పేదల సమస్యలు ఎలా తెలుస్తాయని విమర్శలను ఎదుర్కొన్నారు. రాహుల్ కు అవగాహనా రాహిత్యముందని అయనను అవివేకిగా సంబోధిస్తూ కూడా విమర్శించారు. అన్నింటినీ ఓప్పిగా భరించిన రాహుల్ గాంధీకి సొంత పార్టీలో కూడా విమర్శలు వినాల్సి వచ్చింది. అయినా.. పట్టించుకోని రాహుల్ తన పంథాను యధావిధిగా కొనసాగిస్తూ.. వచ్చారు.

ఆయన పార్లమెంటులో చేసిన తొలి ప్రసంగం అకట్టుకుంది. తన నియోజకవర్గంలోని మారుమూల వుండే ఓ పేదరాలి సమస్యను తన భుజాలపై వేసుకుని రాహుల్ ప్రసంగించడంతో తన పార్లమెంటు నియోజకవర్గంలోని క్షేత్రస్థాయిలో తనకు ఎంత పట్టువుందో అన్న విషయాన్ని అప్పటి తన పాలక పక్షానికే రుచిచూపించారు రాహుల్. దీంతో తన విమర్శకులకు నోటితో కాకుండా చేతలతో సమాధానం చెప్పారు. ఇవాళ రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అయనకు అల్ ది బెస్ట్ చెబుదాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress chief  Mullapally Ramachandran  Priyanka Gandhi  Rahul Gandhi  Sonia Gandhi  

Other Articles