‘one candidate, one constituency’ soon.? రెండు సెగ్మంట్లో పోటీకి త్వరలో చెక్..?

Plea for prohibiting candidates from contesting from more than one constituency

Election Commission, Supreme Court, Attorney General KK Venugopal, social-political activist, Ashwini Upadhyay, Law Commission of India, Chief Justice of India (CJI) Dipak Misra, Justice AM Khanwilkar, Justice DY Chandrachud, Representation of Peoples Act, More than one constituency, one person-one vote, ‘one candidate-one constituency, politics

A Supreme Court bench led by Chief Justice of India (CJI) Dipak Misra has sought the appearance of Attorney General (AG) KK Venugopal in a PIL seeking directions to restrict candidates from contesting from two constituencies simultaneously..

ఒక్క వ్యక్తికి ఒక్క ఓటు.. ఒక నేతకు ఒకే నియోజకవర్గం.. త్వరలో..?

Posted: 12/11/2017 02:17 PM IST
Plea for prohibiting candidates from contesting from more than one constituency

రాజకీయ నాయకులు నోట్లో త్వరలోనే పచ్చి వెలక్కాయ పడనుందా..? ఎలాగైనా చట్టసభల్లో తాము ప్రాతినిధ్యం వహించాలని ఎదురుచూస్తున్న నేతలు ఒక్క స్థానం కాకపోతే మరో స్థానం నుంచి కూడా పోటీచేసి తమ అదృష్టాలను పరిక్షించుకునే నేపథ్యానికి ఇక చరమగీతం పాడబోతున్నారా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. ఈ మేరకు రాజకీయ నేతలు ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.

ఒక్క వ్యక్తికి ఒక్క ఓటు ఓ నేతకు ఒకే నియోజకవర్గం అన్న సారాంశంతో ఈ మేరకు అశ్వినీ ఉపాధ్యాయ అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యాన్ని విచారణకు స్వీకరించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ అంశంలో ప్రభుత్వం అభిప్రాయమేంటోనని తెలుసుకునేందుకు అటర్నీ జనరల్ కెకె వేణుగోపాల్ ను తమ ఎదుట హాజరుకావాలని అదేశాలు జారీ చేసింది. కాగా, పిటిషనర్ వాదనతో కేంద్ర ఎన్నికల సంఘం పూర్తీగా ఏకీభవించింది. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. అటార్నీ జనరల్ హాజరును కోరింది.

అంతకుముందు అశ్వినీ ఉపాధ్యాయ సమర్పించిన పిల్ నేపథ్యంలో త్రిసభ్య దర్మాసనం ఎదుట హాజరైన ఎన్నికల సంఘం అధికారులు.. తాము పూర్తిగా ఈ వాజ్యంతో ఏకీభవిస్తున్నామని అన్నారు. ఈ మేరకు గతంలోనే 2004లో ఒక పర్యాయం, 2016లో మరో పర్యాయం కేంద్రానికి లేఖలు కూడా రాశామని చెప్పారు. తమ లేఖల సారాంశాన్ని పరిశీలించిన కేంద్ర న్యాయశాఖ సమ్మతించినా.. కేంద్రం నుంచి ఎలాంటి బదులు మాత్రం రాలేదని పేర్కొంది.

ఎన్నికల తరువాత అభ్యర్థులు రెండు స్థానాల్లో విజయం సాధించిన పక్షంలో ఉఫఎన్నికలను నిర్వహించాల్సి రావడం.. ఇందుకు భారతీగా ప్రజాధనం కూడా ఖర్చవుతుందని అందుకనే రెండు చోట్ల పోటీ చేసే వెసలుబాటును కల్పించిన రాజ్యంగాలోని ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33(7)ను సవరించాలని కూడా తాము కోరామని ఎన్నికల సంఘం అధికారులు కేంద్రాని కోరారు. అంతేకాకుండా ఇలా ఎన్నికలు జరిగిన తరువాత అరుమాసాలలోపు మరోమారు ఎన్నికలు వస్తే ప్రజలకు కూడా విముఖత వ్యక్తం చేస్తున్నారని తెలిపింది. వీటి ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై కూడా పడే అవకాశముందని పేర్కొంది.

దీంతో ఒక నేత ఒకే చోట పోటీ చేసేలా చట్ట సవరణ చేయాలన్నది తమ అభిప్రాయమని ఈసీ పేర్కొంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై ఎలాంటి చర్య తీసుకోలేదని ఎన్నికల సంఘం వివరించింది. ఒక నేత.. ఒకేచోట పోటీ చేయాలన్న అంశంపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే చట్ట సవరణ జరగని పక్షంలో ఉపఎన్నికలు వచ్చిన పక్షంలో అభ్యర్థులు వాటి ఖర్చులను భరించాలని, అసెంబ్లీ స్థానాలకు వీటి ధరను 5 లక్షలుగా పరిమితి విధించాలని, అదే పార్లమెంటు స్థానాలకైతే పది లక్షల రూపాయల పరిమితిని విధించాలని కూడా ఉపాధ్యయ సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles