pawan kalyan questions pm modi on sardar patel statue ప్రధానికి సర్ధార్ పటేల్ విగ్రహం ఏమని చెబుతుంది: పవన్ కల్యాన్

Pawan kalyan questions pm modi on sardar patel statue

Jana Sena, Pawan Kalyan, chalore chalore chal, ongole, sardar patel, sardar patel statue, pm modi, prakasham, nellore, janasena activists, cine critic, kathi mahesh, akhila priya, nandyal, tourism minister, janasena, TDP, krisha ferry incident, victim familes, , krishna ferry victim families, TDP leaders, wrong propaganda, paritala ravi, tonsure, gundu, ethnic qualities, fatima students, fatima medical college, fatima students pawan kalyan, caste, Indian, human, rajamundry, party activists, telugu states tour, political tour, Andhra Pradesh

Actor turned politician janasena chief power star pawan kalyan asks PM Narendra modi what does the sardar patel statue tell you.

ప్రధానికి సర్ధార్ పటేల్ విగ్రహం ఏమని చెబుతుంది: పవన్ కల్యాన్

Posted: 12/09/2017 07:13 PM IST
Pawan kalyan questions pm modi on sardar patel statue

భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహారశైలిపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోమారు విమర్శలు చేశారు. దేశ స్వాతంత్ర్య సమరయోధుడు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి గొప్పగా చెబుతున్న ప్రధాని నరేంద్రమోడీకి ఆయన జీవితం ఏం చెబుతుందో కూడా తెలుసుకోవాలని సూచించారు.  గుజరాత్ లో వంద అడుగులు పైచిలుకు ఉండే సర్ధార్ వల్లబాయ్ విగ్రహం నరేంద్ర మోదీకి ఏం చెబుతుందో తెలుసా? అని ప్రశ్నించిన ఆయన...ఆయన చిత్రపటం ముందు నుంచోని ప్రశాంతంగా అలోచిస్తే అర్థమవుతుందని అన్నారు.  

పార్లమెంటులో ఎలా పడితే అలా హామీలు ఇవ్వద్దని, ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకోవాలని మోదీకి, బీజేపీకి ఆ విగ్రహం చెబుతుందని అన్నారు. ప్రత్యేక హోదా అనేది చాలా సున్నితమైన అంశమని... దీనిపైన ఉద్యమం చేయాలనుకుంటే తాను చాలా బలంగా చేయగలనని పవన్ చెప్పారు. కానీ ఒక నాయకుడికి చాలా బాధ్యత ఉంటుందని అన్నారు. తాను రోడ్డు మీదకు వస్తే మీరంతా తన వెంట వస్తారని... కానీ, అదే సమయంలో మీకు ఎలాంటి చిన్న ప్రమాదాలు జరిగినా.. మీ అమ్మానాన్నలకు, మీ అక్కాచెల్లెళ్లకు తాను సమాధానం చెప్పాల్సి ఉంటుందని తెలిపారు.

తొలుత తాను సామ, దాన, భేద విధానంలో పోరాడుతానని... ఆ తర్వాతే రోడ్లపైకి వస్తానని పవన్ అన్నారు. ఒక్క సమస్యను పరిష్కరించడం చాలా కష్టసాధ్యమైన విషయమని... ఈ పోరాటం వల్ల తనకు పిడికెడు లాభం కూడా లేదని చెప్పారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడుతూ. రాజకీయ పార్టీలు మాట తప్పితే తనకు కోపం వస్తుందని... అలాంటప్పుడు తాను మౌనం వహించలేనని... అందుకే తాను ఇప్పుడు మీ ముందుకు వచ్చానని తెలిపారు.

రాజకీయ పార్టీలకు చేతకానప్పుడు హామీలు ఇవ్వరాదని... ఇచ్చిన మాటను తప్పితే, వారిని నిలదీసే సమయం కూడా వస్తుందని చెప్పారు. కేంద్రాన్ని తాను ఒకటే ప్రశ్నిస్తున్నానని... ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ఇవ్వకపోవడానికి సరైన కారణాలను ఏపీ ప్రజలకు చెప్పాలని... ఆ కారణాలు అందరినీ తృప్తి పరిచేలా ఉండాలని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  chalore chalore chal  prakasham  sardar patel  sardar patel statue  pm modi  politics  

Other Articles