dont link linking Aadhaar with policies through SMS ఎల్ఐసీ పాలసీ వుందా..? అయితే జాగ్రత్తా సుమా..!

Lic issues cautionary notice against linking aadhaar with policies through sms

LIC, Aadhaar linking, LIC aadhaar, SMS, IRDAI, Life Insurance Corporation, LIC of India, Insurance, Lic linking, last date

LIC of India informs the public and policy holders that no such message has been sent by LIC. Also, no facility to link Aadhaar number to policies is available through SMS in LIC.

ఎల్ఐసీ పాలసీ వుందా..? అయితే జాగ్రత్తా సుమా..!

Posted: 11/27/2017 07:18 PM IST
Lic issues cautionary notice against linking aadhaar with policies through sms

జీవితభీమా పాలసీలకు అధార్ నెంబరుతో అనుసంధానం చేయడాన్ని తప్పనిసరి చేస్తూ.. ఇన్సూరెన్స్ రెగ్యూలేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ అప్ ఇండియా ఇటీవల అదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి కూడా డిసెంబర్ 31ని చివరి గడువు తేదీగా నిర్ణయించిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు అగంతకులు ఇన్సూరెస్స్ హోలర్స్ నుంచి వారి వ్యక్తిగత వివరాలను రాబట్టుకునేందుకు రంగప్రవేశం చేశారు. తీరా దీనిపై సమాచారం అందుకున్న ఎల్ఐసీ సంస్థ.. చివరాఖరున మేల్కోని ఇలాంటి ఎస్ఎంఎస్ లను ఎవరూ విశ్వసించవద్దని అలర్గ్ చేసే ప్రయత్నాన్ని ప్రారంభించింది.

మీ జీవితభీమా పాలసీని అధార్ తో లింక్ చేయని పక్షంలో ఫలానా నెంబర్ కు ఎస్ఎంఎస్ ద్వారా పాలసీని వివరాలతో పాటు ఆధార్ కార్డు నెంబరును జత చేసుకోవాలంటూ అగంతకులు ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువరు ఎల్ఐసీ ఖాతాదారులకు ఎస్ఎంఎస్ సందేశాలను పంపారు. దీనిపై ఎల్ఐసీ తాజాగా స్పందించింది. మీరు ఎల్ఐసీ పాలసీదారులా? మీ పాలసీని ఆధార్ కార్డుతో ఎస్ఎంఎస్ ద్వారా అనుసంధానం చేసుకోవాలని మొబైల్స్ కు వచ్చిన సందేశాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. అంతేకాదు ఇలాంటి వార్తలు నమ్మి.. మోసపోవద్దని సూచించింది.
 
ప్రముఖ బీమా సంస్థ ఎల్‌ఐసీ చెప్పిన వివరాలు ఏమిటేంటే... సోషల్ మీడియాలో వస్తున్న అలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని సూచించింది. అలాంటి సందేశమేదీ ఎల్ఐసీ జారీ చేయలేదని, ఎస్ఎంఎస్ ద్వారా ఆధార్ కార్డును అనుసంధానం చేసుకునే సదుపాయమేదీ ప్రస్తుతానికి కల్పించలేదని పేర్కొంది. ఒక వేళ ఆ సదుపాయాన్ని కల్పించినట్లయితే ఆ వివరాలను తమ వెబ్ సైట్లో పొందుపరుస్తామని తెలిపింది. మీ వ్యక్తిగత వివరాలు పంచుకోవాల్సిన వచ్చినప్పుడు ముందుగా స్థానిక ఎల్ఐసీ శాక కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aadhaar card  insurance policies  LIC  IRDAI  SMS  Fraudsters  cautionary notice  

Other Articles