Bithiri Sathi Attacked By Unknown Person బిత్తిరి సత్తిపై అగంతకుడి దాడి..

Teenmaar bithiri sathi attacked by unknown miscreant

sathi attack, attack on sathi, attack on bitiri sathi, sathi attack visuals, sathi attack, Bithiri Sathi Attack Visuals, bithiri sathi, teenmaar bithiri sathi, teenmaar news, teenmaar sathi, v6 sathi,v6 savitri, teenmaar, ithiri Sathi assaulted, Bithiri Sathi injured, Bithiri Sathi hospitalized, Crime

Bithiri Sathi (Bittiri Satti), who is known for hosting comedy show Teenmar, was rushed to a private hospital in Hyderabad after some bike borne miscreants assaulted. His condition is said to be out of danger.

బిత్తిరి సత్తిపై అగంతకుడి దాడి.. గాయాలు..

Posted: 11/27/2017 06:40 PM IST
Teenmaar bithiri sathi attacked by unknown miscreant

తనదైన యాస, బాష, వేషం, హావభావాల వ్యక్తీకరణతో తెలుగు ప్రేక్షకులను అకట్టుకున్న బిత్తరి సత్తిపై దాడి జరిగింది. ఓ అగంతకుడు సత్తి కారు దిగి వీ6 కార్యాలయంలోకి వస్తుండగా దాడి చేశాడు. తీన్మార్ వార్తలతో ప్రేక్షకుల్ని ఆకర్షించిన సత్తిపై వీ6 కార్యాలయం ఎదుటే దాడి జరిగింది. మధ్యాహ్నం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని వీ6 ఆఫీస్ కు వచ్చిన సత్తి కారులోంచి దిగగానే మణికంఠ అనే ఉన్మాది దాడిచేశాడు.

ఈ అగంతకుడి దాడిలో సత్తికి ముఖం మీద, చెవి కింద గాయాలయ్యాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామాల నేపథ్యంలో తేరుకున్న వీ6 సిబ్బంది అగంతకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయాలపాలైన బిత్తిరి సత్తి, అలియాస్ చేవెళ్ల రవిని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ పదిలోని స్టార్ అసుపత్రికి తరలించారు. స్వల్పగాయాలు మాత్రమే కావడంతో వైద్యం చేసిన అనంతరం సత్తిని డిశ్చార్జ్ చేశారు.

ఈ సంఘటనపై సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు రంగంలోకి దిగి బిత్తరి సత్తిపై దాడి చేసిన మణికంఠను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి వీ6 కార్యాలయం వద్దే తచ్చాడుతున్న అగంతకుడు.. సత్తిపై దాడి చేయడం కోసమే వచ్చినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందంటూ.. ఉన్మాదంగా మాట్లాడుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా మణికంఠను అదుపులోకి తీసుకున్న పోలీసులు దాడి ఘటనపై విచారణ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bithiri sathi  teenmaar  attacked  unknown miscreant  manikanta  crime  

Other Articles