10-Year-old Forced to Beg for mothers' hospital bill పదేళ్ల బాలుడిని బిచ్చగాడిని చేసిన వైద్యులు

10 year old forced to beg for mothers hospital bill

10 year old, forced to beg, lalitha devi, nirdhan, kundhan, maa sheetla nursing home, hospital fee, nursing home patna, Pappu Yadav, Patna

Ending the wait of million of fans, the most awaited title and first look of Pawan Kalyan's 25th film have been just revealed.

పదేళ్ల బాలుడిని బిచ్చగాడిని చేసిన వైద్యులు

Posted: 11/27/2017 05:43 PM IST
10 year old forced to beg for mothers hospital bill

దేశ రాజధాని ఢిల్లీలో కార్పోరేట్ వైద్యం మాటున జరుగుతున్న ధన దోపిడి వెలుగుచూడటంతో నివ్వెరపోయిన దేశప్రజలు.. ఈ ఘటనను తీవ్రంగా విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసిన తరువాత కూడా దేశంలోని కార్పోరేట్ అసుపత్రులు మేల్కోన్నట్లు లేదు. దేశంలో వైద్యం పేరుతో వైద్యులు ధనభక్షకుల మాదిరిగా తయారవుతున్నారనడానికి ఈ ఘటన మరో నిదర్శంన. అభం శుభం తెలియని పదేళ్ల పసివాడు.. సరిగ్గా డబ్బులు కూడా చేత పట్టుకొవడం తెలియని ప్రాయం, డబ్బంటే ఏంటో కూడా తెలియదు, దాంతో చాకెట్లు, బిస్కెట్లు కొనడం మాత్రమే తెలిసిన పసివాడికి పెనుకష్టం వచ్చింది.

తల్లి చాటు బిడ్డగా వుండే ఈ వయస్సు పిల్లాడ్ని కార్పోరేట్ అసుపత్రి ఏకంగా యాచకుడిగా మార్చింది. కనీసం మానవత్వం కూడా లేని వైద్యులు పసివాడికి తన తల్లి కావాలంటే డబ్బు తీసుకురావాలని అస్పత్రి యాజమాన్యం నుంచి గెంటి వేసింది. తన తల్లిని చేరుకునేందుకు మరో మార్గం లేక ఆ పసివాడు బిక్షగాడిగా మారి.. వీధి వీధి తిరిగుతూ యాచిస్తున్నాడు. అయినా ఎందరో యాచకుల నడుమ ఈ బాలుడ్ని చూసే వారెవరూ.. డబ్బులేసే వారెవరు..? అటు అసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న తన తల్లిని చూడాలన్న అకాంక్ష తీరేదెప్పుడు. తన తల్లి ఒడిలో సేదతీరేదన్నడు..?

ఈ విషాదకర ఘటన బీహార్‌లోని మధేపురా జిల్లా అగంకువాన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఆ అబ్బాయి పేరు కుందన్. మధేపురాలోని ఓ ప్రైవేట్ నర్సింగ్‌ హోంలో అతని తల్లికి ఆపరేషన్ అయ్యింది. ఆపరేషన్ అనంతరం రూ. 70వేల బిల్లు రాసిచ్చింది యాజమాన్యం. అంత డబ్బుకట్టుకోలేని ఆ నిరుపేద తల్లీ, బిడ్డలకి సాయం చేసే వారెవరూ కానరాక ఆందోళనకు గురయ్యారు. పాపం ఆ చంటిబిడ్డ మాత్రం.. అమ్మకు ధైర్యం చెప్పి.. సరాసరి సొంతూరు వెళ్లాడు. అక్కడే భిక్షాటన మొదలెట్టాడు.

చివరకు ఆ పిల్లాడి బాధను గుర్తించిన మధేపురా ఎంపీ పప్పు యాదవ్.. ఆ అసుపత్రికి వెళ్లి కుందన్ తల్లిని డిశ్చార్జ్ చేయించారు. ఏకంగా పార్లమెంటు సభ్యుడే అసుపత్రికి చేరుకుని ఆ బాలుడి తల్లిని డిశార్చ్ చేయాలని కోరినా.. అసుపత్రి యాజమాన్యం మాత్రం డబ్బులు కట్టనిదే వదిలే ప్రసక్తే లేదని తేగేసి చెప్పింది. ఇక డబ్బు సకాలంలో అందకపోవడంతో ఆపరేషన్ తర్వాత వేసిన కుట్లను ఊడదీయకుండా అలాగే ఉంచేశారు. వైద్యం నిలిపివేశారు. హాస్పిటల్ నిర్వాకంపై ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles