లవ్ జిహాద్ అన్నది నిజంగా వుందా..? ప్రేమగా పెళ్లి చేసుకున్నవాళ్ల మధ్య వేధింపులు ఎందుకు వస్తాయన్న అనుమానాలు రేగినా.. లవ్ జీహాద్ అన్నది వున్నదని సాక్ష్యం కూడా తెరపైకి రావడం కలకలం రేపుతోంది. ఈ వేదింపులు ఎదుర్కోన్నది ఏకంగా ఒకనాటి మోడల్ కావడం కూడా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే... 13 ఏళ్ల క్రితం ముంబైకి చెందిన రష్మీ (42) మోడలింగ్ లో రాణించే సమయంలో ముస్లిం మతానికి చెందిన ఆసిఫ్ (47) ను వివాహం చేసుకుంది. వివాహం సమయంలో ఎవరి మతాచారాలు వారివని, ఒకరి మతాచారాలకు మరొకరు అభ్యంతరం చెప్పకూడదన్న అంగీకారంతో వివాహం జరిగింది.
అయితే, గత కొంత కాలంగా ముస్లిం మతాచారాలు ఆచరించాలంటూ భర్త ఆమెను ఒత్తిడి చేయడం ఆరంభించాడు. దానిని తాను తిరస్కరించడంతో, మరో మహిళ (28)ను వివాహం చేసుకోవడమే కాకుండా, తన ఏడేళ్ల కుమారుడ్ని తనకు ఇవ్వకుండా, తన దగ్గరే ఉంచుకుని తనకు కాకుండా చేశారని ఆమె భర్తపై ఆరోపణలు చేసింది. ఇప్పుడు తన కుమారుడు తనను రాక్షసిని చూసినట్టు చూస్తున్నాడని ఆమె కన్నీరుమున్నీరైంది.
ఇప్పుడు తన భర్త వివాహం చేసుకున్న మహిళ తన సోదరుడి గర్ల్ ఫ్రెండేనని ఆమె తెలిపింది. తొలుత ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న తన భర్త, తర్వాత ఆమెను వివాహం కూడా చేసుకున్నాడని ఆరోపించింది. తన భర్త, అతని కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సెక్షన్ 354, 323, 324, 504, 506 మరియు 34ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more