woman atm thief behind the bars ఏటీయం మహిళా దొంగ అరెస్టు.. సహచరుల పరారీ

Woman atm thief behind the bars

woman atm thief, woman atm thief held, woman atm thief gateway hotel, woman atm thief hdfc bank, hdfc bank atm, machavaram police, gate way hotel security, crime

woman atm thief held, on the tip given by security in guntur machavaram at gate way hotel hdfc atm.

పోలీసుల అదుపులో ఏటీయంలోకి వెళ్లిన మహిళ! ఎందుకు.?

Posted: 11/20/2017 10:42 AM IST
Woman atm thief behind the bars

గుంటూరు జిల్లా మాచవరంలో అనుమానిత మహిళా దొంగను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్థానికుల నుంచి అనుమానపు వ్యక్తులు ఏటీయం కేంద్రం వద్ద తచ్చాడుతున్నరని సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన ఇద్దరు మహిళలు అక్కడి నుంచి పలాయనం చిత్తగించగా, ఏటీయం కేంద్రంలోకి వెళ్లిన మహిళ మాత్రం పోలీసులు అడ్డంగా చిక్కింది. అమెను జీపులో స్టేషన్ కు తరలించిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఈ ఘటన గుంటూరు జిల్లాలోని మాచవరం పరిధిలోని మహాత్మాగాంధీ రోడ్డులో గేట్ వే హోటల్ కు ఎదురుగా వున్న హెచ్డీఎఫ్‌సీ ఏటీయం కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. క్ిరతం రోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ఏటీయం కేంద్రంలోకి ఒక మహిళ లోపలకు వెళ్లింది. ఆమె లోపలకు వెళ్లగానే ఏటీఎంను మోషీన్ ను తెరవడం గేట్ వే హోటల్‌లోని సెక్యూరిటీ సిబ్బంది చూశారని పోలీసులు చెబుతున్నారు. అయితే అమెకు సెక్యూరిటీగా ఏటీయం కేంద్రం వద్ద కాపాలాగా వున్న ఇద్దరు మహిళలను చూడటంతో అనుమానం మరింత బలోపేతమైందని స్థానిక యువకుడు తెలిపాడు.
 
అయితే వీరిపై అనుమానంతో స్థానికులంతా గుమ్మిగూడి ఏటీయం కేంద్రం వద్దకు చేరుకోగా, కాపలాగా వున్న మహిళలు అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు. లోపల ఉన్న మహిళను స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించగా, హుటాహుటిన వచ్చిన పోలీసులు అమెను అదుపులోకి తీసుకున్నారు. పారిపోయిన మహిళల కోసం అక్కడే చాలాసేపు వెతికారు.వారు కనిపించకపోవడంతో దొరికిన మహిళా దొంగను అదుపులోకి తీసుకుని విచారించగా, తాను లోనికి వెళ్లే సరికే ఏటీయం వెనుకబాఘం తెరచి వుందని చెప్పినట్లు సమాచారం. అయితే అమె వద్ద పోలీసులు బ్యాగ్ కూడా వుండటాన్ని గమనించి అనుమానిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : woman theif  hdfc atm  machavaram  gateway  securuty  crime  

Other Articles