చెన్నైలోని ఆదంబాక్కంలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ప్రేమను అమెదించడానికి నిరాకరించిన యువతితో పాటు అమె తల్లిని, చెల్లిని కూడా అంతం చేసే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో ప్రియురాలు సజీవదహనం కాగా, అమె తల్లి, చెల్లి మాత్రం తీవ్రంగా గాయపడి అస్పత్రిలో చికిత్స పోందుతున్నారు. వారి పరిస్థితి విషమంగానే వుందని వైద్యులు తెలిపారు. నిందితుడు పోలీసులకు లొంగిపోయి తనను పెళ్లి చేసుకోనని పలుమార్లు కోరినా తిరస్కరించినందుకే దారుణానికి పాల్పడ్డానని వాంగ్మూలం ఇచ్చాడు.
ఘటన వివరాల్లోకి వెళ్తే... సేలంకు చెందిన షణ్ముగం (50), రేణుక (42) దంపతుల కుటుంబం చెన్నై ఆదంబాక్కం సరస్వతి నగర్ ఏడో వీధిలో స్థిర పడింది. వీరికి ఇందుజా (22), నివేద (20), మనోజ్ (15) అనే పిల్లలున్నారు. పెద్దకుమార్తె ఇందుజా స్థానికంగా ఓ సాప్ట్ వేర్ సంస్థలో ఇంజనీర్ గా పనిచేస్తుంది. అయితే తనతో పాటు గిండిలోని ఓ ప్రముఖ స్కూల్ లో చదువుకున్న వేళచ్చేరికి చెందిన ముత్తుకుమార్ కుమారుడు ఆకాష్ (24) అమెను గత కొన్ని రోజులుగా వెంబడిస్తూ తనను ప్రేమిస్తున్నానని చెబుతూ వెంటపడ్డాడు.
పాఠశాలలో ఒకే తరగతిలో చదువుకున్న చనువుతో కొంత సన్నిహితంగా మెదిలితే.. అదే ప్రేమ అని బావించిన యువకుడు అమె వెంటపడి వేధించసాగాడు. అయితే అకాష్ ప్రతిపాదనను తిరస్కరించిన ఇందుజపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. ప్రేమోన్మాదిగా మారిన అకాస్.. ప్లాన్ ప్రకారం టర్పంటైల్ క్యాన్ తో ఆమె ఇంటికి చేరుకున్నాడు. రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో ఆమె ఇంటి తలుపుతట్టాడు. ఇందూజ తల్లి వచ్చి తలుపు తెరిచింది. ఓ సారి ఇందుజతో మాట్లాడి వెళ్తానని చెప్పడంతో.. లోనికి రానిచ్చింది రేణుక.
అంతే అక్కడే దాచిన క్యాన్ ను బయటకు తీసి, క్షణాల్లో ఇంట్లోకి దూరి, ఇందూజ మీద పోశాడు. అతనిని అడ్డుకునేందుకు వచ్చిన ఆమె తల్లి, చెల్లి మీద కూడా పోసి, నిప్పంటించాడు. మంటలు క్షణాల్లో ఆవహించాయి. ఇంట్లో ఉన్న మనోజ్ వచ్చేసరికి ఆకాశ్ పారిపోయాడు. వారి కేకల్ని విన్న ఇరుగుపొరుగు వచ్చి, వారిని రక్షించే ప్రయత్నం చేసేలోపు ఇందూజ సజీవదహనమైంది. తీవ్రగాయాలపాలైన రేణుక, నివేదలను ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆకాశ్ ఆదంబాక్కం పోలీసుల స్టేషన్ లో లొంగిపోయాడు. అనంతరం తన ప్రేమ పయనం నుంచి ఉన్మాదం వరకు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చి నేరాన్ని అంగీకరించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more