UIDAI approves 3 new ways to link Aadhaar with SIM | సర్వీస్ సెంటర్ లకు వెళ్లకుండానే ఆధార్ అనుసంధానం.. మూడు పద్ధతులు

Otp and other ways to link aadhaar with sim

Mobile Number Aadhaar Link, UIDAI, Ajay Bhushan Pandey, OTP IVRS app, UIDAI New Guidelines

Three New Ways To Link Mobile Numbers With Aadhaar Get UIDAI Nod. As per the new methods that were permitted, mobile numbers can be linked with Aadhaar through OTP (one-time password), app or IVRS facility -- the measure aimed at simplifying the entire process and making it convenient for people. The plans were considered and approved from the point of view of security, compliance with the Aadhaar Act and protection of privacy, said UIDAI CEO Ajay Bhushan Pandey.

ఆధార్-మొబైల్ నంబరు లింక్ ఇక ఈజీ

Posted: 11/16/2017 08:32 AM IST
Otp and other ways to link aadhaar with sim

మొబైల్ నంబరుకు ఆధార్ కార్డు అనుసంధానం చేసుకునే ప్రక్రియను ఇక సులువతరం కానుంది. ఓటీపీ ద్వారా కూడా తమ సిమ్ కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చంటూ టెల్కోలకు యూఐడీఏఐ అనుమతి ఇచ్చింది.

ఓటీపీ ఆధారిత సిమ్ వెరిఫికేషన్‌కు అనుమతి ఇచ్చినట్టు యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే తెలిపారు. వారు సమర్పించిన బ్లూప్రింట్‌కు అనుమతి ఇచ్చామని, డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఓటీపీ ద్వారా సిమ్ వెరిఫికేషన్ చేసుకోవచ్చని ఆయన వివరించారు.

మొబైల్ నంబరుకు ఆధార్ అనుసంధానం కోసం ప్రభుత్వం గత నెలలో మూడు విధానాలను అమల్లోకి తీసుకొచ్చింది. తాజాగా ఆపరేటర్లు చేసిన ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్) ఆధారిత లింకింగ్ ప్రతిపాదనకు ఓకే చెప్పింది. తాజా విధానం ద్వారా మొబైల్ వినియోగదారులు ఇంటి దగ్గరి నుంచే ఓటీపీ, యాప్, ఐవీఆర్ఎస్ విధానాల ద్వారా ఆధార్‌ను లింక్ చేసుకునే అవకాశం చిక్కింది. ఈ లెక్కన్న తుది గడువు ఫిబ్రవరి 6వ తేదీ లోపు అనుసంధానం ప్రక్రియ పూర్తి చేయొచ్చన్నది ప్రభుత్వం ఆలోచన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles