Fake Rs 2000 note in Axis Bank ATM ఇదేం నోటు.. ఏం కథ.. ఏటీయంలోకి ఎలా వెళ్లిందో తెలిసేదెట్టా..?

Fake rs 2000 note in axis bank atm in bangalore

this is shotting purpose only, fake rs. 2000 note, dayanand reddy, lakkasandra, axis bank, bangalore, karnataka

An Axis Bank ATM in Lakkasandra bengaluru of karnataka released the faulty Rs 2000 note with weird text 'This Is For Shotting Purpose Only', on the top right side of the note.

ఇదేం నోటు.. ఏం కథ.. ఏటీయంలోకి ఎలా వెళ్లిందో తెలిసేదెట్టా..?

Posted: 11/01/2017 05:10 PM IST
Fake rs 2000 note in axis bank atm in bangalore

సరిగ్గా ఏడాది క్రితం ఇదే నెలలో నోట్ల రద్దు వ్యవహారంతో గుట్టుచప్పుడు కాకుండా చెలమాణిలోకి వచ్చి చేరిన రూ. రెండు వేల నోటు.. దాదాపుకు అరు మాసాలపాటు దేశ ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేసింది. కొత్తగా వచ్చిన ఈ నోటు ప్రజలు అందుకునే కన్నాముందుగానే నకిలీలు రాజ్యమేలాయి. ఏదీ అసలీ నోటో.. ఏది నకిలీనో తేల్చుకునేందుకు ప్రజలకు ఎక్కవ సమయం పట్టింది. చిల్డ్రన్స్ బ్యాంక్ అని కొన్ని నకిలీ నోట్లు రాగా, మరికొన్ని అచ్చుగుద్దినట్లు అసలు నోటుకు సరిపోలేలా నకిలీలు వచ్చేశాయి.

ఇక దేశంలోని పలు ప్రాంతాలలో ఏటీయం కేంద్రాలలోనే రూ.2000. నకిలీ నోట్లు దర్శనమివ్వడంతో అటు బ్యాంకు అధికారులు, ఇటు ప్రజలు అందోళనకు గురయ్యారు. ఇక ఏడాది తరువాత కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే వున్నాయి అనడానికి బెంగళూరులో జరిగిన ఘటనే నిదర్శనం. దయానందరెడ్డి అనే యువకుడు స్థానికంగా వున్న లక్కసంద్ర రెండో కూడలిలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంకు వెళ్లి రూ.6 వేల నగదు డ్రా చేయగా మూడు రూ.2 వేల నోట్లు వచ్చాయి.

దీంతో వాటిలోని ఓ నోటుతో సమీపంలోని పెట్రోల్ బంక్ కు వెళ్లిన దయానందరెడ్డి రూ.2 వేల నోటు ఇవ్వగా అది నకిలీ నోటు అని సిబ్బంది గుర్తించారు. దీంతో బాధితుడు లబోదిబోమన్నాడు. ఇప్పుడే బ్యాంకు ఏటీయం కేంద్రం నుంచి మూడు నోట్లు డ్రా చేశానని చెప్పాడు. నోటును నిశితంగా పరిశీలించగా రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా అని ఉండాల్సిన చోట, దిస్‌ ఈజ్‌ షాటింగ్‌ పర్పస్‌ ఓన్లీ అని ఆంగ్ల అక్షరాల్లో ముద్రించి ఉంది. దీనిపై లక్కసంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా.. స్వీకరించలేదని, యాక్సిస్‌ బ్యాంక్‌కు వెళ్లి నకిలీ నోటును చూపించినా స్పందించలేదని బాధితుడు వాపోయాడు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles