Students served alcohol in cool drinks at BC hostel ఔవ్వ..! విద్యార్థులకు మద్యం తాగించి.. డాన్సులా..

Students served alcohol in cool drinks at vizianagaram bc hostel

students, BC Hostel, Warden, Staff, liquor, parents, cool drinks, dance, paidi raju, cheepurupalli, vizianagaram

In a shocking incident happened in Vizianagaram district's Cheepurupalli, BC hostel staff served alcohol to students. According to sources BC hostel staff lost their control after consuming alcohol and mixed the remaining in cool drink and served it to students.

ఔవ్వ..! విద్యార్థులకు మద్యం తాగించి.. డాన్సులా..

Posted: 11/01/2017 06:00 PM IST
Students served alcohol in cool drinks at vizianagaram bc hostel

నవ్యాంధ్రలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. విజయనగరం జిల్లాలోనీ చీపురుపల్లి బీసీ హాస్టల్లో సిబ్బంది విద్యార్థుల చేత మద్యం తాగించి డాన్సులు వేయించిన ఘటన అలస్యంగా వెలుగుచూసింది. హాస్టల్ సిబ్బంది మద్యం సేవిస్తూ నియంత్రణ కోల్పోయారు. అక్కడికి వచ్చిన విద్యార్థులకు కూల్ డ్రింక్స్ లో మద్యం కలిపి ఇచ్చారు. ఆ తర్వాత ఆ పానీయం సేవించిన విద్యార్థులు ఊగిపోయారు.

కాగా, వారితో డ్యాన్సులు చేయిస్తూ సిబ్బంది ఎంజాయ్ చేశారు. ఈ ఘటన అలస్యంగా వెలుగుచూడటంతో విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు, ఆరు తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఏవరైనా మద్యం తాగిస్తారా..? అని నిలదీస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఘటనపై విచారణ జరిపారు. కూల్ డ్రింక్స్‌లో మద్యం కలిపి విద్యార్థులతో తాగించడం వాస్తవమేనని బీసి సంక్షేమ శాఖ అధికారి సీహెచ్‌ పైడిరాజు తెలిపారు.

పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా వసతిగృహంలో బస చేసేందుకు వచ్చిన ఆయన చెవిన విషయం పడటంతో విచారణ జరిపించారు. వసతిగృహం సిబ్బంది విద్యార్థులతో మద్యం తాగించిన ఘటనపై ఆయన విచారణ జరిపారు. ఏ రోజున, ఎప్పుడు, ఎవరెవరు ఉండగా, ఇలాంటి ఘటన జరిగిందని, అసలేం జరిగిందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులతో కమాటి మద్యం తాగించడం వాస్తవమేనన్నారు. ఉన్నతాధికారులకు విషయాన్ని తెలిపానని, వారే సిబ్బందిపై చర్యలకు పూనుకుంటారని పైడిరాజు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : students  BC Hostel  Warden  Staff  liquor  parents  cool drinks  dance  paidi raju  cheepurupalli  vizianagaram  

Other Articles