Upendra's new 'Karnataka Pragnyavantha Janata Paksha' launched హీరో ఉపేంద్ర కొత్త పార్టీ పేరు తెలుసా..?

Upendra s new karnataka pragnyavantha janata paksha launched

upendra, Sandalwood hero, upendra in politics, Karnataka Pragnyavantha Janata Paksha, upendra political party, Gandhi Bhavan, Karnataka, karnataka politics, politics

Sandalwood superstar Upendra who recently made entry to the politics announced his party name at Gandhi Bhavan here on Tuesday.

హీరో ఉపేంద్ర కొత్త పార్టీ పేరు తెలుసా..?

Posted: 10/31/2017 02:24 PM IST
Upendra s new karnataka pragnyavantha janata paksha launched

కన్నడ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ అవిర్భవించింది. శాండిల్ వుడ్ సూపర్ స్టార్ గా కన్నడ ప్రేక్షకుల మన్ననలను అందుకున్న హీరో ఉపేంద్ర కొత్త రాజకీయా పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీని స్థాపిస్తున్న విషయాన్ని ఇదివరకే తెలిపినా.. ఇవాళ అధికారికంగా పార్టీ పేరును కూడా ప్రకటించారు ఉపేంద్ర. కర్ణాటక ప్రాజ్ఞవంత్ జనతా పక్ష(కేపీజేపీ) పేరుతో ఈ సూపర్ స్టార్ కొత్త పార్టీ స్థాపించారు. పలువురు మద్దుతుదారులతో కలసి కాకీ రంగు చొక్కాను ధరించే ఈ పార్టీ పేరును ప్రకటించారు.

బెంగళూరులోని గాంధీ భవన్ లో ఉపేంద్ర తనతో కలసి వచ్చిన పలువురు తారలు, మేథావులు, వివిధ రంగాల ప్రముఖలతో కలసి పార్టీని ఆవిష్కరించారు. పార్టీ పేరును ప్రకటించిన ఉపేంద్ర, ఇది కేవలం పార్టీ కాదని, ప్రజల కోసం తమ పార్టీ అని తెలిపారు. తాను కేవలం ప్రజల కోసం ఓ వేదికను సృష్టించానన్నారు. ఇందులో చేరాలని ఆసక్తి ఉన్నవారు ఎలాంటి బేషజాలం లేకుండా మెహమాటానికి పోకుండా చేరవచ్చునన్నారు. బూర్జువా పార్టీలు, బూర్జువా సిద్దంతాలు కాకుండా మారుతున్న క్రమంలో మారుతున్న పరిస్థితులకు అనుగూణంగా మార్పు తీసుకురావడమే తన స్వప్నమని అన్నారు.

వచ్చే నెల (నవంబర్‌) 10న పార్టీ వెబ్ సైట్‌, యాప్ ను ప్రారంభించనున్నట్టు ఉపేంద్ర తెలిపారు. సమాజాన్ని, రాష్ట్రాన్ని ఎలా మెరుగుపరచాలో తెలుపుతూ తమ ఆలోచనలతో ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు తమ వంతు సహకరించాలన్నారు. 2018 లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేపీజేపీ పార్టీ పోటీ చేయనుందని, ఈ ఎన్నికలకు కేవలం ఆరు నెలలే సమయం ఉందన్నారు. మనం గెలవకపోవచ్చు కానీ మార్పు తీసుకురావడం మనం ప్రధాన ధ్యేయమని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles