traffic restictions at satyam theatre road | సత్యం థియేటర్ పక్కకెళ్లొద్దురో డైవరూ..

Traffic restictions at satyam theatre road

hyderabad police, traffic restrictions, satyam theatre road, three months, culvert constrution, GHMC, Maithrivanam, Ameerpet

The hyderabad police issues traffic restrictions at satyam theatre road for nearly three months as culvert constrution is in progress

సత్యం థియేటర్.. పక్కకెళ్లొద్దురో డైవరూ..

Posted: 10/31/2017 03:34 PM IST
Traffic restictions at satyam theatre road

హైదరాబాద్ నగరంలో ఏ చిన్న వీధి చూసినా ఏమున్నది గర్వకారణం అని అంటే...ట్రాఫిక్ జామ్ లే నన్న సమాధానం ఠక్కున వచ్చేస్తుంది. వర్షాకాలంలో వరుణుడు కరుణిస్తుండడంతో గొతులు, దీనికి తోడు మెట్రో పనులతో కుచించికుపోయిన దారుల అంటారా. అంతేకాదండోయ్ మనం నిత్యం వాహనాలను నడిపే దారుల కింద ఎన్ని నాలాలు వున్నాయో.. ఎన్ని కల్వర్టులు వున్నాయో తెలుసా..? తెలియదు కదూ.  

ఎందుకంటే చుట్టుపక్కల చూసీ తీక్షణంగా అన్నింటినీ గమనిస్తూ వాహనాలను నడిపే అవకాశం మహానగరం ఏ వాహనచోదకుడికి ఇవ్వలేదు. కాసింత మెల్లిగ వెళ్లినా.. వెనక నుంచి వాహనదారుల హారన్ సౌండ్ వస్తుండగానే పక్కగా చటుక్కున వెళ్లే వాహనదారుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ విషయాన్ని పక్కన బెడితే ఇటీవల వాహనాల రద్దీ పెరగడంతో దెబ్బతిన్న కల్వర్టులను పునర్మించేందుకు గ్రేటర్ హైదరబాద్ నగరపాలక సంస్థ సిద్దమైంది.

మరీ ముఖ్యంగా మెట్రో పనుల నిర్మాణాల కారణంగా అమీర్ పేటలోని సత్యం థియేటర్ మార్గంలో రద్దీ పెరిగింది. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ అధికారులు నాలా వంతెన నిర్మాణ పనులు చేపట్టందుకు రెడీ అయ్యారు. దీంతో ఈ రహదారిలో భారీ వాహనాలు.. బస్సులు, లారీలు వెళ్లేందుకు అడ్డంకి ఏర్పడనున్న నేపథ్యంలో ఈ గురువారం నుంచి మూడు నెలల పాటు ఈ రోడ్డులో ట్రాఫిక్ అంక్షలను విధించారు ట్రాఫిక్ పోలీసులు.

కనకదుర్గ దేవాలయం నుంచి సత్యం థియేటర్‌ వెళ్లే రోడ్డుపై ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ అంక్షలు కేవలం ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలకు మాత్రమే వర్తిస్తాయని ఆయన తెలిపారు. దీంతో మైత్రీవనం నుంచి గ్రీన్ ల్యాండ్స్ వైపు వెళ్ళే ఈ వాహనాలను ధరమ్ కరమ్ రోడ్డు, జీహెచ్ఎంసీ ప్లేగ్రౌండ్, సోనబాయ్ ఆలయం, సత్యం థియేటర్ మీదుగా పంపించనున్నారు. కాగా, ఈ రోడ్డుపై ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలను అనుమతించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles