vishal slams bjp raja on encouraging piracy ’’తప్పులు చేస్తూ.. నీతుల చెబుతారా.. సిగ్గులేదు..!’’

Actor vishal slams bjp s raja for watching pirated mersal

mersal row, actor vijay, mersal actor, mersal controversy, BJP leader, H Raja, mersal BJP, BJP comments, BJP, mersal release, mersal collection, Thalapathy Vijay, mersal, vijay, mersal box office collection, mersal

The controversy over Vijay-starrer "Mersal" continued today, with actor Vishal taking exception to senior BJP leader H Raja's reported remarks that he had watched the movie online.

’’తప్పులు చేస్తూ.. నీతుల చెబుతారా.. సిగ్గులేదు..!’’

Posted: 10/23/2017 11:23 AM IST
Actor vishal slams bjp s raja for watching pirated mersal

కాలీవుడ్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్లను గణనీయంగా రాబడుతున్న హీరో విజయ్ తాజా చిత్రం 'మెర్సెల్'అదే స్థాయిలో రాజకీయపరంగా వివాదాస్పదమైంది. చిత్ర విజయానికి ఇది కూడా ఓ కారణం కావచ్చునని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్న క్రమంలో ఈ చిత్రం చుట్టూ చిత్రంలోని పలు డైలాగులు వివాదాస్పందగా వున్నాయంటే ఓవైపు ప్రకంపనలు రేగుతుండగానే.. అంతకుమించిన సినీ, రాజకీయ ప్రముఖుల మద్య డైలాగులు మరింత వివాదాస్పదంగా మారుతున్నాయి.

చిత్రంలో జీఎస్టీపై వున్న డైలాగులపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హెచ్.రాజా ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాను 'మెర్సెల్' పైరసీ కాపీని చూశానని... సినిమాలోని డైలాగులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని వ్యాఖ్యానించడం సీనీ, రాజకీయ ప్రముఖుల మధ్య వివాదానికి అజ్యం పోసింది. సాంకేతిక విప్లవంతో ఏడాది పాటు అడాల్సిన చిత్రాలు కేవలం కలెక్షన్ల పరంగా హిట్ అయ్యాయా..? లేదా..? అన్న స్థాయికి వచ్చిన విషయం తెలిసిందే.

దీంతో బీజేపి నేత  వ్యాఖ్యలపై హీరో విశాల్ మండిపడ్డాడు. ఒక జాతీయ నేత స్థాయిలో ఉండి పైరసీ సినిమా చూశానని చెప్పడం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సంఘంలో పెద్దమనిషిగా ఉంటూ, పైరసీ సినిమా చూశానని చెప్పడానికి సిగ్గు లేదా? తప్పులు మీరు చేస్తూ.. నీతులు మాత్రం ప్రజలకు చెబుతారా..? అంటూ తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఇలాంటి పని చేసినందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని... పైరసీ లింకులను తొలగించడానికి ప్రభుత్వానికి సహకరించాలని డిమాండ్ చేశాడు. మరో సీనియర్ నటుడు పార్తీబన్ కూడా హెచ్ రాజా వ్యాఖ్యలను తప్పుబట్టారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mersal row  actor vijay  controversy  BJP leader H Raja  Hero vishal  Kollywood  politics  

Other Articles