Alert Indian organisations Data Hacked and Ready to Sold | హ్యాకర్ సంచలన ప్రకటన.. ఇండియన్స్ కంపెనీల డేటాను చీప్ రేటుకు అమ్మేస్తాడంట.

Indian organisations data hacked

Indian Companies, Personal Data, Hacker, DarkNet Hacker, DarkNet Indians Data, DarkNet Indian Company Data, Indian Hackers, Quick Heal Alert

Quick Heal Reveals Over 6,000 Indian companies' data leaked online, put up for sale for 15 Bitcoins. Security experts have reached out to government authorities and Asia Pacific Network Information Centre (APNIC), and asked them to alert the affected firms and suggest them to change passwords.

ఇండియన్ డేటా చోరీ.. సంచలన ప్రకటన

Posted: 10/04/2017 10:10 AM IST
Indian organisations data hacked

సైబర్ సెక్యూరిటీ నిపుణులు డార్క్ నెట్ లో వచ్చిన ఓ ప్రకటన ఆధారంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సుమారు 6000 భారతీయ కంపెనీల సమచారం తన దగ్గర ఉందని చెబుతున్న ఓ హ్యాకర్ దానిని కేవలం 15 బిట్ కాయిన్లకు అమ్మేస్తానంటూ ప్రకటించటం సంచలం సృష్టిస్తోంది.

ఐటీ భద్రతా సంస్థ క్విక్‌ హీల్‌ కు చెందిన ‘సీక్రైట్‌ సైబర్‌ ఇంటెలిజెన్స్‌ ల్యాబ్స్‌’ గుర్తించిన దాని ప్రకారం డార్క్ నెట్ లో ఒక హ్యాకర్ ఒక సంచలన ప్రకటన పెట్టాడు. అందులో తన దగ్గర 6 వేల భారతీయ సంస్థలకు చెందిన కీలక సమాచారం ఉందని తెలిపాడు. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలకు చెందిన ముఖ్యమైన సమాచారం ఇందులో ఉందని తెలిపాడు. ఈ సమాచారం ఖరీదు కేవలం 42 లక్షల రూపాయలేనని ప్రకటించాడు. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను సమీక్షించడం, ఐపీ అడ్రస్ లను కేటాయించే ‘నేషనల్‌ ఇంటర్నెట్‌ ఎక్స్చేంజ్‌ ఆఫ్‌ ఇండియా’కు చెందిన కీలక సంస్థ ‘ఇండియన్‌ రిజిస్ట్రీ ఫర్‌ ఇంటర్నెట్‌ నేమ్స్‌ అండ్‌ నెంబర్స్‌’ (ఐఆర్‌ఐఎన్‌ఎన్‌) పైనే హ్యాకర్‌ దాడి చేసి, కీలక సమాచారం చోరీ చేశాడని నిపుణులు నిర్ధారించారు.

దీంతో యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్ మెంట్‌ అర్గనైజేషన్‌, ఇస్రో, ఆర్బీఐ, ఎస్బీఐ, బీఎస్ఎన్‌ఎల్‌, ఈపీఎఫ్ఓ వంటి కీలక ప్రభుత్వ సంస్థలన్నీ ఇబ్బందుల్లో పడ్డాయని వారు తెలిపారు. కాగా, హ్యాకర్ చేసింది నిజమే అయితే మాత్రం భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద సమాచార తస్కరణగా క్విక్ హీల్ అభిప్రాయపడింది. మరోవైపు భద్రతా నిపుణులు తక్షణమే ఆయా కంపెనీలకు పాస్ వర్డ్ హెచ్చరించాలని కేంద్ర ప్రభుత్వానికి, ఏషియా ఫసిపిక్ నెట్ వర్క్ ఇన్ఫర్మేషన్ సెంటర్(ఎపీఎన్ఐసీ) సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles