Hyderabad Heavy Rains Damage Tollywood Celebrities Houses | భారీ వర్షాల దెబ్బ వీళ్లకూ తప్పలేదుగా...

Hyderabad rains suffers celebrities

Hyderabad, Heavy Rains, Tollywood Celebrities, Rajamouli Guest House, Roja House, Panchavati Colony, Manikonda, Siva Balaji House

Hyderabad Heavy Rain Alert Continues. Tollywood Celebrities like Rajamouli, Roja, Sharwanand and Siva Balaji Residentials at Panchavati Colony Damaged with Rains.

భారీ వర్షం.. వాళ్లకూ నష్టం తప్పలేదు

Posted: 10/04/2017 09:35 AM IST
Hyderabad rains suffers celebrities

హైదరాబాదులో కురుస్తున్న భారీ వర్షాలు నగర వాసులకు నరకం చూపిస్తోంది. మళ్లీ నేటి మధ్యాహ్నాం నుంచి భారీ వర్ష సూచన ఉండటంతో అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కూకట్ పల్లి, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే వరుణుడు తన ప్రతాపం చూపించటం మొదలుపెట్టాడు. ఇక వర్షాల దాటికి సామాన్య ప్రజానికమే కాదు.. సెలబ్రిటీలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

ముప్పు పొంచి ఉందా?

సెలబ్రిటీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న మణికొండ.. అందులోని పంచవటి కాలనీని కాస్ట్లీ ఏరియా అయినప్పటికీ వర్షం ధాటికి దారుణంగా దెబ్బతింది. మొన్న, నిన్న కురిసిన వర్షాలకు ఆ ప్రాంతం చెరువులా మారింది. అగ్ర దర్శకుడు రాజమౌళికి ఇక్కడ ఓ గెస్ట్ హౌజ్ ఉండగా, అందులోకి నీరు చేయటంతో మినీ థియేటర్ నాశనం అయ్యిందని తెలుస్తోంది. బిగ్ బాస్ విజేత శివబాలాజీ నివాసముండే శ్యామ్స్‌ వింటేజ్‌ అపార్ట్‌ మెంట్స్‌ సెల్లార్‌ పూర్తిగా నీటమునిగింది.

హీరో శర్వానంద్ ఇంటిలోకి కూడా నీరు చేరగా.. సినీ నటి రోజా ఇంటికి వెళ్లే రోడ్డుపై మూడు అడుగుల మేర నీరు నిలిచింది. దీంతో ఆ ప్రాంత వాసులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ కాలనీకి పైభాగంలో ఉండే బుల్కాపూర్‌ నాలాపై మట్టి వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఈ కాలనీలోకి వరదనీరు వచ్చి పడిందని అధికారులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles