diwali gift in advance to archakas from Government అర్చకులకు ముందస్తు దీపావళి కానుక..

Archakas to get salaries like government staff from november

Archakas to get salaries, Telangana Archakas to get salaries, CM diwali gifts to archaks in advance, Archakas to get salaries as govt employees, Archakas to get salaries from novembet, CM KCR, Archakas, diwali gift, salaries, on rolls, November, Telangana

Telangana CM KCR gives Archakas diwali gift in advance, announces that his government will pay salaries to Government Staff from November.

అర్చకులకు ముందస్తు దీపావళి కానుక..

Posted: 09/15/2017 07:34 PM IST
Archakas to get salaries like government staff from november

అర్చకులు, ఆలయ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ముందుగానే దీపావళి కానుకను అందించింది. ప్రతి నెలా ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు అందనున్నట్లు ఇకపై అర్చకులకు కూడా వేతనాలు అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదరిగానే అర్చకులకు కూడా పే స్కేలు అమలు చేస్తామని వెల్లడించారు. ఆలయాల భూములు అన్యాక్రాంతంపై గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయన్నారు. సమైక్య పాలనలో తెలంగాణకు, తెలంగాణలోని దేవాలయాలకు అన్యాయం జరిగిందని అవేదన వ్యక్తం చేశారు.

మరీముఖ్యంగా తెలంగాణలో ఆలయాలు పూర్తి నిర్లక్ష్యానికి గురైయ్యాయని అన్నారు. పుష్కరాలను కూడా సరిగా నిర్వహించలేని దుస్థితి ఏర్పడిందని అన్నారు. ఇకపై ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక అర్చకులకు స్థితి ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకీల మోత అన్నట్లుగా తయారైందని, సంఘంలో గౌరవ మర్యాదలు దక్కుతున్నా.. పూట గడవడమే కష్టంగా మారిందన్నారు. అర్చకత్వం చేసే యువకులకు పెళ్లికి అమ్మాయిలను ఇచ్చేందుకు వెనుకాడే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు.

నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అర్చకుల దీనస్థితి మారనుందని తెలిపారు. ఇక నుంచి 5,625 మంది అర్చకులకు, ఆలయ ఉద్యోగులకు వేతనాలు ఇస్తామన్నారు. ప్రతి నెలా 1న వేతనాలు అందజేస్తామని తెలిపారు. వేతన సవరణ కూడా వీరికి అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం తగ్గిస్తామన్నారు. ఆలయాల పర్యవేక్షణకు ధార్మిక పరిషత్‌ ఏర్పాటు చేస్తున్నామని, మరో మూడు వేల ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం వర్తింపజేస్తామని సీఎం వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM KCR  Archakas  diwali gift  salaries  on rolls  pay scale  November  Telangana  

Other Articles