GST on fuel can help rein in prices ఇంధనంపై జీఎస్టీ వేస్తే సరి.. సగానికి తగ్గనున్న ధరలు..!

Petrol prices may come down from rs 70 to rs 38 under gst

petrol prices, diesel prices, GST on petrol, GST on diesel, GST on fuel, arun jaitley, Petrol prices GST, diesel prices GST, petrol, diesel, GST, fuel, Dharmendra Pradhan, PM Modi, rein in fuel prices

The Petroleum products' inclusion in GST only way for rational fuel prices," tweeted Dharmendra Pradhan as the petroleum prices reached three-year high. Bringing petroleum products under the GST regime will make the fuels cheaper.

జీఎస్టీ పరిధిలోకి ఇంధనం.. సగానికి తగ్గనున్న ధరలు..!

Posted: 09/15/2017 05:58 PM IST
Petrol prices may come down from rs 70 to rs 38 under gst

దేశంలో అన్నింటినీ సంస్కరిస్తానని గత ఎన్నికలలో ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపి.. అన్నట్లుగానే పలు హామీలను నెరవేరుస్తూ ముందుకు కదులుతుంది. అయితే ప్రధాని మోడీ అదృష్టమో లేక కాకతాళీయంగా కలసివచ్చిన అవకాశమో తెలియదు కానీ అప్పటి వరకు అంతర్జాతీయంగా వున్న క్రూడ్ అయిన్ బ్యారెట్ ధరలకు కూడా ఎన్డేయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కసారిగా పడిపోయాయి. కాగా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎక్సైజ్ డ్యూటీలను వేసి తగ్గిన ధరలను మాత్రం ప్రజలకు అందకుండా చేసింది.

ఇక రాష్ట్రాలు కూడా అదే స్థాయిలో వ్యాట్ విధించి కాస్తో కూస్తే తగ్గిందన్న ధరలను అమాంతం పెంచేసేలా చేశాయి. దీంతో ఇటు వాహనదారులతో పాటు అటు ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీంతో జనాగ్రహం నుంచి తప్పించుకునేందుకు ఇంధన మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోనుందా...? ఈ విషయాన్ని ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి తీసుకువెళ్లారా..? అంటే అవునన్న సంకేతాలే వస్తున్నాయి. అదెలా అంటే..?

రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలపై ఇక రాష్ట్రాలు ఎడా పెడా వేసే వ్యాట్ ధరలను తప్పించేందుకు.. తాము వేసే ఎక్సైజ్ డ్యూటీని కూడా ఇక లేకుండా చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతుందా..? అవుననే సమాధానమే వస్తుంది. ఎలా అంటే ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటం ద్వారా. అవునండీ.. ఒక దేశం ఒకే పన్ను అని చెప్పుకొ్స్తూ జీఎస్టీకి తెరలేపిన బీజేపి.. అదే విధానంలోకి ఇంధనాన్ని కూడా తీసుకురానుంది. దీంతో పెరుగుతున్న ఇంధన ధరలపై జనాగ్రహం లేకుండా చేసేందుకు చర్యలు చేపట్టనుంది.

పైసలు.. పైసలుగా పెరుగుతూ.. రెండు నెలల్లోనే తొమ్మిది రూపాయల మేర ధర పెరిగిన పెట్రోల్.. ఇక జీఎస్టీ పరిధిలోకి వస్తే సగానికి పైగానే ధర తగ్గుతుంది. ఇంధన దరలు తగ్గాలంటే వాటిని కూడా జీఎస్టీ పరిధిలో చేర్చడమే మార్గం అని ఆయన చేసిన ట్విట్టు ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ మేరకు కేంద్ర ఇంధన శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ కేంద్ర అర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కోరారని సమాచారం. అయితే అరుణ్ జైట్లీ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ కేంద్ర ఇంధన శాఖ వినతిని పరిశీలనలోకి తీసుకుంటుందా..? లేదా.? అన్నది వేచిచూడాల్సిందే.

ఇదిలావుంటే ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే.. 12శాతం స్లాబ్ లో అయితే హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 38 రూపాయలు, డీజిల్ 36 రూపాయలకు దిగివస్తోంది. అదే 18శాతం స్లాబ్ లో అయితే పెట్రోల్ 40, డీజిల్ 38 రూపాయలకే దొరుకుతుంది. అదే 28శాతం స్లాబ్ కింద పరిగణించినా పెట్రోల్ 43, డీజిల్ 41 రూపాయలకే లభిస్తోందని ఓ వాణిజ్యపత్రిక కథనాలను ప్రచురించింది. ప్రస్తుతం ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, డీలర్ కమిషన్ ఇలా భారీగా పన్నులు విధిస్తుండటం వల్లే ధర పెరుగుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol  diesel  GST  fuel  arun jaitley  Dharmendra Pradhan  PM Modi  rein in fuel prices  

Other Articles