Sadhvi Prachi says Rohingya Muslims 'more dangerous' than IS సంచలన వ్యాఖ్యలు చేసిన సాధ్వీ ప్రాచీ

Rohingyas worse than isis sadhvi prachi demands for throwing out

Rohingyan muslims, more dangerous, ISIS, dormitory, thrown out, India, Sadhvi Prachi, budhists, myanmar, shelter, kashmir, militant threat

Terming Rohingya Muslims as “worse than ISIS”, firebrand Hindutva leader Sadhvi Prachi questioned why the refugees from Myanmar should be given shelter in India

సంచలన వ్యాఖ్యలు చేసిన సాధ్వీ ప్రాచీ

Posted: 09/08/2017 03:00 PM IST
Rohingyas worse than isis sadhvi prachi demands for throwing out

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో అలవాటు పడిన విశ్వహిందూ పరిషత్ నాయకురాలు, సాథ్వీ ప్రాచీ మరోసారి అదే తరహాలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మయన్మార్ నుంచి భారత్ కు  శరణార్థులుగా తరలివస్తున్న రోహింగ్యా ముస్లింలు ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల కంటే అత్యంత ప్రమాదకరమైన వారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా ముస్లింలను మయన్మార్ కు తిప్పి పంపించాలని సాథ్వీ ప్రాచీ కేంద్రప్రభుత్వాన్ని కోరారు.

రోహింగ్యా ముస్లింలు శరణార్థులుగా భారత్ వచ్చేందుకు మన దేశమేమి వారి పట్ల ధర్మశాల కాదని అమె దుయ్యబట్టారు. రోహింగ్యా ముస్లింల అక్రమ చోరబాట్ల వల్ల దేశంలో తీవ్రవాదం వ్యాప్తి చేందే ప్రమాదముందని అమె అందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే 40వేల మంది రోహింగ్యా ముస్లిములు భారత్ తో అశ్రయం పోందుతున్నారని వారిలో పదిహేనువేల మందికిపైగా కాశ్మీరు రాష్ట్రంలో ఉన్నారని సాథ్వీ ఆరోపించారు. అందువల్లే కాశ్మీరు రగలిపోతుందని అమె వ్యాఖ్యానించారు.

రోహింగ్యా ముస్లింలు శరణార్థులుగా భారత్ నే ఎంచుకోవడంలో అంతర్యమేమిటని అమె ప్రశ్నించారు. దీని వెనుకు ఎదో కుట్ర దాగివుందని అమె అందోళన వ్యక్తం చేశారు. కాగా, రోహింగ్యా ముస్లింలకు ఆశ్రయం ఇవ్వడానికి ప్రపంచంలోని ముస్లిమ్ దేశాలు కూడా ముందుకు రావడం లేదని ఇలాంటపుడు మన దేశం వారికి ఎందుకని అశ్రయం కల్పించాలని డిమాండ్ చేశారు. మయన్మార్ లోని బౌద్ధులకు మద్ధతు తెలిపిన ప్రాచీ వారు శాంతికాములని ప్రస్థుతించారు. రోహింగ్యా ముస్లిములు బౌద్ధులను లక్ష్యంగా చేసుకున్నారని సాథ్వీ ప్రాచీ ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles